మారిన రాజకీయాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు వ్యూహాల్ని మార్చుకోవటం రాజకీయ నేతలు చేస్తుంటారు. దీనికి భిన్నంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాలిటిక్స్ ఉంటాయని చెప్పాలి. దశాబ్దాల తరబడి ఆయన చేసే రాజకీయాలన్ని మతం చుట్టూనే తిరుగుతుంటాయన్న విమర్శలు ఉన్నాయి.అయితే.. తమ పార్టీ ముస్లింలకు మాత్రమే పరిమితమైన పార్టీ కాదని.. కులమతాలకు అతీతంగా వ్యవహరిస్తుందని చెబుతున్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఓవైసీ బ్రదర్స్ ప్రస్తావన వస్తేనే.. అంతెత్తున ఎగిరిపడే బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా ఓవైసీ బ్రదర్స్ కు ఒళ్లు మండేలా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ.. కేంద్రమంత్రి అమిత్ షా అంటే అసద్ కు భయమని.. ప్రధాని మోడీ నిర్ణయాలతో ఆయన వణికిపోతున్నట్లు చెప్పారు.
ఈ కారణంతోనే దారుస్సలాంలో జాతీయ జెండా ఎగురవేసి.. జనగణమణ పాడారని.. రానున్న రోజుల్లో పెద్ద.. చిన్న ఓవైసీలు వందేమాతరం పాడాల్సిందేనని వ్యాఖ్యానించారు. దేశంలో ముస్లింల గౌరవాన్ని పెంచుతున్నది ప్రధాని మోడీనేనని వ్యాఖ్యానించటం గమనార్హం. వందేమాతరాన్ని పాడేందుకు ససేమిరా అనే ఓవైసీ బ్రదర్స్.. రాజాసింగ్ చెప్పినట్లుగా చేసే అవకాశం ఉందా? అన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలదు.