అక్బరుద్దీన్ పై రాజాసింగ్.. ఎంత మాట..

Update: 2019-08-24 10:19 GMT
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు.. ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో ఎంత బయటకు తిట్టుకున్నా.. ఎక్కడైనా కలిస్తే హాయ్ బాయ్ అంటూ అందరూ పలకించుకుంటారు. కానీ అది బీజేపీలో కాదు.. కొంత మంది కరుడుగట్టిన నేతలు మాత్రం తమ శతృత్వాన్ని బయట కూడా చూపిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు..

తెలంగాణలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ తీరు కూడా అలానే ఉంది. కేంద్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనను జైల్లో పెట్టిన చిదంబరంపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. అదే బీజేపీ పార్టీలోని తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం పూర్తి డిఫెరెంట్. హిందుత్వ ఎజెండాతోనే ఆయన ఎన్నికల్లో గెలిచాడు. హిందుత్వాన్నే నమ్ముకుంటాడు. హైదరాబాద్ లో ఆ హక్కుల కోసం పోరాడుతుంటాడు..

ఎంఐఎం అన్నా.. ఆ పార్టీ నేతలన్నా ఉవ్వెత్తున లేచే రాజాసింగ్ తాజాగా అక్బరుద్దీన్ ఓవైసీపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్ కోలుకోవాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు రాజాసింగ్ దారుణమైన సమాధానం ఇచ్చారు.అలాంటి వ్యక్తులు పైకిపోతేనే బెటర్ అంటూ హాట్ కామెంట్ చేశారు.

రాజకీయాల్లో  శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరన్న పదానికి పూర్తి భిన్నమైన రాజకీయాన్ని రాజాసింగ్ పోషిస్తున్నట్టు అర్థమవుతోంది. ఎంత మతప్రాదిపదిక శతృత్వం ఉన్నా..  తనతో పాటు గెలిచిన తోటి ప్రజాప్రతినిధి అయిన అక్బర్ మరణాన్ని కోరుకున్న రాజాసింగ్ తీరు వివాదాస్పదం అవుతోంది.


Full View

Tags:    

Similar News