బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత రాజాసింగ్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ సంకల్ప శిబిరం పేరుతో హైదరాబాద్ శివార్లలోని భారతి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఆరెస్సెస్ సమావేశాలు మొదలయ్యాయి. ఇవి మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. శిబిరానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు - పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ - పార్టీ ఎంపీలు బండి సంజయ్ - ధర్మపురి అర్వింద్ - సోయం బాపూరావు - గరికపాటి మోహన్ రావు - ఎమ్మెల్యే రాజాసింగ్ - సంఘ్ - రాష్ట్ర - జిల్లా బీజేపీ నేతలంతా తలపై నల్ల టోపీ - ఖాకీ ప్యాంట్ - తెల్ల అంగీ - చేతిలో కర్రతో హాజరయ్యారు.
ఇటీవలే ఖాకీ నిక్కరుకు బదులుగా ప్యాంట్‌ను భాగం చేస్తూ ఆర్ ఎస్ ఎస్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజా సమావేశాల్లో ఖాకీ రంగు ప్యాంట్ ధరించిన ఫైర్ బ్రాండ్ నేత రాజాసింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎంపీలు - ఎమ్మెల్యేలు ఇలా సంఘ్ మూల సిద్ధాంతాన్ని ప్రతిబింబించే వస్త్రాధరణలో హాజరయ్యారు. సరూర్ నగర్ స్టేడియంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న సభలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధానోపన్యాసం చేయనున్నారు. కరసేవకులు మన్సూరాబాద్ - హస్తినాపురం - వనస్థలిపురం నుంచి మార్చ్ చేస్తూ వచ్చి ఎల్బీనగర్ క్రాస్ రోడ్డు దగ్గర కలుస్తారు. అక్కడి నుంచి స్టేడియానికి వెళతారు. 25 వేల మంది ఇందులో పాల్గొననున్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరుకాలేదు.రాజ్యాంగపరంగా కీలకమైన పదవిలో ఉండటం వల్ల ఆయన విచ్చేయలేదని సమాచారం. ఆర్ ఎస్ ఎస్ డ్రెస్ కోడ్ గా నిక్కరుకు బదులు పాంట్ తీసుకువచ్చిన తర్వాత నిర్వహిస్తున్న భారీ శిబిరం ఇదే కావడంతో సంఘ్ సేవకుల యునిఫామ్ కొత్తగా కనిపించింది. 15 ఏళ్ల సంఘ్ సేవక్ నుంచి మొదలుకుంటే 80 ఏళ్ల కర సేవక్ వరకు - ముఖ్య శిక్షక్ నుంచి జాతీయ అధ్యక్షుడు - ఇతర జాతీయ - రాష్ట్ర స్థాయి నేతలు - ఎంపీలు - ఎమెల్యేలు అందరూ ఒకే చోట హోదా - పదవి తేడా లేకుండా నేలపైనే భోజనం చేయడం - నిద్రించడం - కూర్చోవడం ఈ శిబిరం ప్రత్యేకత.