ఇప్పటికే ఏపీలో రగులకున్న టిప్పు సుల్తాన్ వివాదం ఇప్పుడు తెలంగాణలోనూ మొదలైంది. రాయలసీమలోని ఓ జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయతలపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేపై ఏపీ బీజేపీ నాయకులు దండెత్తి అడ్డుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ లోనూ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని అడ్డుకొని తీరుతామని తెలంగాణ బీజేపీ హెచ్చరించింది.
బోధన్ మున్సిపాలిటీ పరిధిలో టిప్పు సుల్తాన్, సలావుద్దీన్ ఓవైసీ విగ్రహాలు పెట్టాలని అక్కడి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. వాళ్ల విగ్రహాలు పెడితే కూల్చేస్తామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కు రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ మేరకు గురువారం మీడియా ముందుకొచ్చిన రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. సిటీలో ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలే సలావుద్దీన్ విగ్రహం పెట్టలేదని.. ఆ పార్టీ ఆపీసు దారుస్సలాంలోనూ ఆయన విగ్రహం లేదన్నారు.
50 లక్షల మంది హిందువులను చంపిన టిప్పుసుల్తాన్ ను సైతాన్ లా చూస్తామని.. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెడితే హిందువులు ఒప్పుకోరని చెప్పారు.
ఇలా ఏపీ బీజేపీ లాగానే.. తెలంగాణ బీజేపీ సైతం టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని అడ్డుకొని తీరుతామని బయలు దేరుతోంది. మరి ఈ వివాదం ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి.