తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తు దొరికిపోయిన ఓటుకు నోటు ఎపిసోడ్ లో రాజయ్య పాత్ర ఉన్నట్లు ఇటీవల ఓ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై తీవ్రంగా కలత చెందిన రాజయ్య అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు విషయంలో బాబు అడ్డంగా దొరికి పోయిందే కాకుండా సామాన్యులను బలి చేసేలా వ్యవహరిస్తున్నారంటూ నిలదీశారు.
ఓటుకు నోటు కుంభకోణంతో తనకే మాత్రం సంబందం లేదని రాజయ్య వెల్లడించారు. తప్పుడు వార్తలు రాయించడం సరికాదన్నారు. నా ఫై వస్తున్న వార్తలు రాస్తున్నారా.. రాయిస్తున్నారా అనేది అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే వివిధ పరిణామాల వల్ల తాను తీవ్ర ఆందోళనలో ఉన్నానని రాజయ్య తెలిపారు. ఇలాంటి వార్తలు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని వాపోయారు. బాధతో హార్ట్ ఎటాక్ వచ్చే పరిస్థితి ఎదురయిందని తెలిపారు. ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని తెలిపారు. కానీ నిజాలు చెప్పాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చినట్లు వివరించారు. చంద్రబాబు ట్రాప్ లో పడినట్లు నిరూపిస్తే ఉరిశిక్షకు సిద్ధమని ప్రకటించారు.
తన ఉప ముఖ్యమంత్రి పదవి పోయిన క్రమంలోనే బంగారు తెలంగాణాలో కూలీగా ఉంటానని ప్రకటించిన విషయాన్ని రాజయ్య ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పుడు చెప్పిన మాటనే ఇప్పుడు చెప్తున్నట్లు రాజయ్య స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని వదులుకున్నానని అలాంటి తనపై ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు డబ్బు ఆశ చూపినా.. తెలంగాణ జెండా వీడలేదని తెలిపారు. అలాంటిది తాను బాబు ఇచ్చే డబ్బులకు ఎలా లొంగుతానని ప్రశ్నించారు. ఒకవేళ తాను తప్పు చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజముంటే, వాటిని నిరూపిస్తే బహిరంగ ఉరికి సిద్ధమని ప్రకటించారు. తనను అనవసరంగా రెచ్చ గొడితే చట్టపరంగా పోరాడుతానని ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/