ఏపీ రాజధాని అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణాలకు సంబంధించి డిజైన్లను ఫైనలైజ్ చేయడానికి ప్రభుత్వం తరఫున బృందం లండన్ వెళ్లింది. అక్కడ నార్మన్ అండ్ ఫోస్టర్స్ సంస్థ ఆర్కిటెక్టులతో సమావేశమై వారు తాజాగా రూపొందించిన డిజైన్లను అక్కడే ఓకే చేసే ప్రయత్నం వీరు చేస్తారు. ఈ బృందంతో దర్శకుడు రాజమౌళి కూడా వెళ్లారు. అయితే లండన్ లో రాజమౌళి తన మీద ఎలాంటి రాజకీయ ముద్ర పడకుండా.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ఆయన పచ్చ కండువాలు కప్పుకునే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని సమాచారం.
మంత్రి నారాయణ తదితరులతో కూడిన బృందం అధికారికంగా నార్మన్ అండ్ పోస్టర్స్ తో సమావేశం కావడానికే లండన్ వెళ్లింది. ఈ బృందంలో గల్లా జయదేవ్ తదితర పార్టీ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే సహజంగా ఏపీ మంత్రుల స్థాయి నాయకులు వచ్చినప్పుడు విదేశాల్లో అక్కడ తెలుగువాళ్లు - ఆయా పార్టీల అభిమానులు వచ్చి కలుస్తుండడం పరిపాటి. ఆ సందర్భంగా పార్టీ కండువాలు వేసుకోవడం ఫోటోలకు పోజులివ్వడం చాలా సహజంగా జరుగుతుంటుంది. నారాయణ బృందం కూడా అలాగే పచ్చ కండువాలతో కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
ఇలాంటి తెలుగుదేశం ముద్ర ఉన్న కార్యక్రమాలకు దర్శకుడు రాజమౌళి దూరంగా ఉంటున్నారు. రాజమౌళి రాజకీయంగా ఎన్నడూ తెలుగుదేశంతో కలిసి పనిచేయలేదు. గతంలో ఆయన లోక్ సత్తా పార్టీకి అనుకూలంగా మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతే తప్ప.. రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఈసారి కూడా కేవలం తాను డిజైన్ల పరిశీలను మాత్రమే వచ్చాడు గనుక.. అంతవరకే ఉంటున్నారు తప్ప.. లండన్ లో మంత్రి నారాయణ పాల్గొంటున్న ప్రతి కార్యక్రమానికీ వెళ్లకుండా తన హద్దులు తాను పాటిస్తున్నారని తెలుస్తోంది.
చంద్రబాబునాయుడు అడిగారు కదాని ఎగబడి పచ్చ రంగు పులుముకోకుండా.. తనను ఏ సాయం అడిగారో అంతవరకు మాత్రమే ఉండి.. ఆ పని మాత్రమే చేసిపెట్టడానికి రాజమౌళి సిద్ధంగా ఉండడం అనేది .. ఆయన విచక్షణ అని పలువురు అంటున్నారు.