`బాహుబలి` చూస్తున్నప్పుడు థ్యాంక్స్ టు అంటూ రామోజీరావుతో పాటు పలువురి పేర్లు కనిపిస్తాయి. అందులో దర్శకుడు దేవాకట్టా పేరు కూడా ఉంటుంది. అది చూసినప్పట్నుంచి దేవాకట్టాకి రాజమౌళి ఎందుకు థ్యాంక్స్ చెప్పాడబ్బా? అని అందరిలోనూ సందేహం. ఇంతకీ దేవాకట్టాకీ, బాహుబలికీ మధ్య ఏంటి సంబంధం అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ సస్పెన్స్‌కి దేవాకట్టానే తెర దించారు. దేవాకట్టా `బాహుబలి`కి మాటల రచయితగా పనిచేశాడట. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలకి దేవా డైలాగ్స్ రాశాడట. కొన్ని డైలాగులే అయినప్పటికీ అవి రాజమౌళికి బాగా నచ్చాయట. దీంతో దేవాకట్టా కి క్రెడిట్‌నిస్తూ బాహుబలి టైటిల్స్‌లో థ్యాంక్స్ కార్డ్ వేశాడు
రాజమౌళి. బాహుబలి తెరపై తన పేరు చూసుకొని దేవాకట్టా ఆనందపడిపోతున్నాడు. నేను రాసింది రెండు మూడు డైలాగులే అయినా... రాజమౌళి నా పేరు వేశారంటే ఆయన గొప్ప మనసుకు నిదర్శనం అంటూ దేవాకట్టా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. సినిమాలో చాలా తక్కువ డైలాగులే ఉంటాయి. అందులో కొన్ని డైలాగుల్ని దేవాకట్టా రాయడం విశేషం. విశ్వసనీయ సమాచారం మేరకు మరణం... అంటూ పతాక సన్నివేశాల్లో సైనికులు వెనుదిరుగుతున్నప్పుడు ప్రభాస్ చెప్పే డైలాగుల్నే దేవాకట్టా రాశాడని తెలిసింది. నిజంగా ఆ డైలాగులు చైతన్యాన్ని రగిలించేలా ఉంటాయి. `ఆటోనగర్ సూర్య`లో దేవాకట్టా రాసిన డైలాగులు నచ్చే రాజమౌళి ఆయనకి కబురు పెట్టినట్టు తెలుస్తోంది.