తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేశారు. తన పార్టీ పేరు ‘మక్కల్ సేవై కచ్చి’గా ఎన్నికల సంఘం రిజిస్టర్ చేయడం.. పార్టీ ఎన్నికల గుర్తుగా ‘ఆటో’ను కేటాయించడం జరిగింది. ఈ విషయాన్ని తలైవా అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. అయితే.. దీనికి కూడా ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం.
అయితే.. ఇందుకు రెండు తేదీలు ప్రచారంలో ఉన్నాయి. రజనీకాంత్ జనవరి 1న పార్టీని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతుండగా.. జనవరి 17 న ఈ కార్యక్రమం ఉంటుందని కూడా అంటున్నారు. తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయ పట్టణం మధురైలో భారీ ర్యాలీ ద్వారా రజిని తన పార్టీని ప్రారంభించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇందులో 17వ తేదీనే చాలా మంది నమ్ముతున్నారు. రజనీ తన పార్టీ ప్రారంభానికి జనవరి 17 ను ఎంచుకోవడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని కూడా చెబుతున్నారు. ఈ రోజునే తమిళనాడు మాజీ సీఎం ఎంజిఆర్ జన్మించారు. ఆయన జయంతి రోజున పార్టీ ప్రకటించడం ద్వారా.. ఎంజీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తానని చెప్పేందుకు రజనీకాంత్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.