రాజపక్సను దేశం దాటనీయని శ్రీలంక ప్రజలు.. ఎయిర్ పోర్టులో షాక్

Update: 2022-07-12 12:30 GMT
శ్రీలంకను పాలిస్తున్న రాజపక్స కుటుంబానికి ప్రజలు గట్టి షాకిస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడి నివాసాన్ని ముట్టిడించి రణరంగం చేసిన ప్రజలు ఇప్పుడు అధ్యక్షుడు రాజపక్స సోదరుడు, మంత్రి బాసిల్ రాజపక్సకు గట్టి షాక్ ఇచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి భార్యతో కలిసి దుబాయ్ పారిపోవడానికి వచ్చిన బాసిల్ రాజపక్సను తరిమేశారు.

శ్రీలంక ప్రజలు దేశాన్ని ఇంతటి దుస్థితికి దిగజార్చిన రాజపక్స కుటుంబంపై రగిలిపోతున్నారు. రాజపక్స నలుగురు సోదరుల కారణంగానే శ్రీలంక దేశం సర్వనాశనమైందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలిపారిపోయాడని ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలోనే అధ్యక్షుడు గొటబాయ సోదరుడు, శ్రీలంక మాజీ ఆర్థిక మంత్రి.. రాజపక్స సోదరుల్లో ఒకరైన బాసిల్ రాజపక్స తాజాగా భార్యతో కలిసి దుబాయ్ వెళ్లడానికి ప్రయత్నించడంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో  ప్రజలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి భార్యతో కలిసి దుబాయ్ వెళ్లడానికి ప్రయత్నిస్తున్న బాసిల్ రాజపక్సేను తరిమేశారు. ఆయనను విదేశాలకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. 3 గంటల పాటు ఎదురుచూసిన బాసిల్ రాజపక్స చివరకు ఎయిర్ పోర్ట్ సమీపంలోని మిలటరీ స్థావరానికి వెళ్లి అక్కడ తలదాచుకున్నారు.

ఆర్థిక సంక్షోభం కారణంగా పీకల్లోతు కూరుకుపోయిన శ్రీలంక ప్రజలు అక్కడ ఇన్నాళ్లు దేశాన్ని పాలించి ఈ దుస్థితికి కారణమైన రాజపక్స నలుగురు బ్రదర్స్ మీద రగిలిపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులు ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడి భవనంలోకి చొరబడి నానా రచ్చచేశారు. ఆందోళనకారులనుఏమీ చేయలేక అక్కడి ప్రభుత్వం, మిలటరీ సైలెంట్ అయిపోయారు. రాజపక్స సోదరుల వల్లే దేశం సర్వనాశనమైపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.వారి అక్రమాల ఫలితంగానే శ్రీలంక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ ఆర్థిక మంత్రి, రాజపక్స సోదరుల్లో ఒకరైన బాసిల్ రాజపక్స ఆయన భార్యతో కలిసి దుబాయ్ వెళ్లడానికి ప్రయత్నించారు. అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో బాసిల్ రాజపక్స, తన భార్యతో కలిసి కొలొంబో ఎయిర్ పోర్టుకు వచ్చారు. వీఐపీ చెక్ ఇన్ కౌంటర్ కు రాగా.. బాసిల్ పాస్ పోర్ట్ క్లియర్ చేయడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరాకరించారని తెలిసింది.

శ్రీలంక సంక్షోభం కారణంగా దేశం విడిచి వదిలివెళ్లడానికి వీవీఐపీలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బాసిల్ కూడా దుబాయ్ వెళ్లిపోవడానికి రాగా అధికారులు, ప్రజలు అడ్డుకున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల వరకూ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే బాసిల్ ఉండి ఇమిగ్రేషన్ క్లియర్ కాకపోవడంతో విమానాశ్రయ సమీపంలోని మిలటరీ స్థావరానికి భార్యతో కలిసి బాసిల్ వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ఫొటోలు, వీడియోలు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News