ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజుల ఖిల్లాగా పేరొందిన రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. వందల సభలు - రోడ్‌షోలతో హోరెత్తిన ఎడారి రాష్ట్రంలో శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. తెలంగాణతో సహా ప్రచారం ముగిసిన ఈ రాష్ట్రంలో పోలింగ్, ఫలితాలు సైతం అదే తేదీన వెలువడటమే కాకుండా ఫలితాల విషయంలో అదే రీతిలో ఉత్కంఠ నెలకొంది. ఐదేళ్లకోసారి అధికారం చేతులు మారే ఆనవాయితీ ఉన్న రాజస్థాన్‌లో తాజా ఎన్నికలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అధికార పీఠం కోసం సీఎం వసుంధరా రాజే, విపక్ష కాంగ్రెస్ తరఫున అశోక్ గెహ్లాట్ - సచిన్ పైలట్ హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రధాని మోదీ - కేంద్ర మంత్రులు - బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు సుడిగాలి పర్యటనలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆలయాలను సందర్శిస్తూ ప్రచారంలో దూకుడు పెంచారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రోడ్‌షోలు, సభల్లో విస్తృతంగా పాల్గొన్నారు. సీఎం వసుంధర రోజుకు కనీసం ఐదు సభలు లేదంటే రోడ్‌షోలతో జనంలోకి దూసుకెళ్లారు.
రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు 199 చోట్ల ఎన్నికలు జరుగనున్నాయి. ఆల్వార్ జిల్లా రామ్‌గఢ్ లో బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తం 2,274 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో 189 మంది మహిళలు. మొత్తం 4.77 కోట్ల మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెబల్స్ బెడద అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ను భయాందోళనలకు గురిచేస్తున్నది. సుమారు 50 స్థానాల్లో ప్రధాన పార్టీలకు వారు సవాల్ విసురుతున్నారు. రైతుల సమస్యలు - అవినీతి - నిరుద్యోగం తదితర అంశాల్ని ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రధాన అస్ర్తాలుగా ఎంచుకున్నది. తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని ప్రకటించింది.
రాజస్థాన్ ఎన్నికల పోరు హోరాహోరిగా సాగుతోంది. జల్రా పఠాన్ నుంచి బరిలో ఉన్న సీఎం వసుంధర పై కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్రసింగ్ పోటీపడుతున్నారు. టోంక్ స్థానం నుంచి సచిన్ పైలట్ పోటీచేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర రవాణామంత్రి, బీజేపీ ఏకైక ముస్లిం ఎమ్మెల్యే యూనస్‌ఖాన్‌తో పైలట్ తలపడుతున్నారు. బీఎస్పీ సైతం 190 స్థానాల్లో తన అభ్యర్థుల్ని బరిలో దింపింది. ప్రముఖ జాట్ నాయకుడు హనుమాన్ బేనివాల్ ఇరుపార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ పేరుతో పార్టీ స్థాపించిన హనుమాన్ 58 మంది అభ్యర్థులను ఎన్నికల్లో నిలిపారు.
ఎన్నికల ప్రచారంలో విమర్శలూ శ్రుతిమించాయి. ప్రధాని కులంపై కాంగ్రెస్ సీనియర్ సీపీ జోషి వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. రాహుల్ లక్ష్యంగా ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ రాఫెల్ ఒప్పందంపై ఆరోపణలు గుప్పించగా, యూపీ సీఎం ఆదిత్యానాథ్ ఏకంగా హనుమంతుడిని తెరపైకి తెచ్చారు. దక్షిణ రాజస్థాన్‌లోని వాగడ్ రీజియన్‌లోని భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ).. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లకు చుక్కలు చూపిస్తున్నది. గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో గిరిపుత్రుల ప్రాబల్యం ఎక్కువ. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తమను పట్టించుకునేవారు కరువయ్యారని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీటీపీ పేరుతో వారు బరిలోకి దిగి ప్రధాన పార్టీలకు వణుకు పుట్టిస్తున్నారు. దుంగార్పూర్ - బన్స్‌వారా - సిరోహి - ప్రతాప్‌గఢ్ - ఉదయ్‌పూర్ జిల్లాల్లో 10 స్థానాల్లో పోటీచేస్తున్నారు. అభివృద్ధి పేరుతో అడవుల్ని ధ్వంసం చేస్తున్నారని, తమ భూముల్ని కార్పొరేటు శక్తులకు ధారాదత్తం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిణామంతో ప్రధాన పార్టీల్లో కలవరం మొదలైంది. మొత్తంగా ఎడారి నేలలో పోరు హాట్ హాట్‌గా సాగుతోంది.