మైకు కనిపిస్తే చాలు.. సూక్తిముక్తావళి కబుర్లు చెప్పేస్తుంటారు ప్రధాని నరేంద్రమోడీ. . అయిఆయన మాటలు వింటుంటే.. రాజకీయ పార్టీలో ఉండి ఇన్ని మంచి మాటలు చెప్పే నేత ఎవరైనా ఉంటారా? ఎక్కడైనా దొరుకుతారా? అనిపించేస్తుంది. ఆయన మాదిరే ఆయన పార్టీ నేతలు కూడా సుద్దపూసలుగా చెప్పుకునే గొప్పలెన్నో. అయితే.. పార్టీలన్నీ ఒకటేనని.. జెండాలు.. వారి మాటలు మాత్రమే వేరన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అధికారం చేతిలో ఉంటే చాలు.. చెలరేగిపోయే తీరుకు బీజేపీ ప్రజాప్రతినిధులు ఏ మాత్రం మినహాయింపు కాదు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కమలనాథుల్లో క్వశ్చన్ చేయాల్సిన ‘ఆర్టిస్ట్’లు చాలామందే ఉన్నారని చెప్పాలి.
దీనికి తగ్గట్లే ఉంటుంది తాజా ఉదంతం. రాజస్థాన్ లో బీజేపీ పవర్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ వారి హడావుడి అంతా ఇంతా కాదని చెబుతుంటారు. ఒక ఎమ్మెల్యేకి తెలిసిన కార్యకర్త.. సరైన పత్రాలు లేకుండా వెళుతుంటే.. పోలీసులు ఆపి.. తనిఖీ చేసి చలానా రాశారు. అధికారపార్టీ కార్యకర్తకే చలానా రాస్తావా? అంటూ ఆగ్రహంతో ఎమ్మెల్యే భర్త వద్దకు వెళ్లారు.
దీంతో.. ఆయన తీవ్రంగా మండిపడటమే కాదు.. కార్యకర్తతో వెళ్లిన ఆయన.. డ్యూటీలో ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ పార్టికి చెందిన వ్యక్తిని వదిలిపెట్టాలని.. అసలు ఎందుకు చలానా రాశారంటూ హడావుడి చేశారు. ఇదెంత వరకూ వెళ్లిందంటే.. తిట్ల దండకం నుంచి చేయి చేసుకునే వరకూ వెళ్లినట్లుగా చెబుతున్నారు. దీంతో.. పోలీసులు సైతం ఈ వ్యవహారంపై చిరాగ్గా ఉన్నారట. పోలీసులు తప్పు చేయకుండా.. డ్యూటీ చేసిన పాపానికి ఇలా చేయి చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇంతకూ ఈ రచ్చ అంతా రాజస్థాన్ లోని ఎక్కడ జరిగిందన్న విషయంలోకి వెళితే.. కోటా జిల్లా మహవీర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అధికార మదంతో చేసే ఇలాంటి చేష్టలపై బీజేపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎంత ఎమ్మెల్యే భర్త అయితే మాత్రం. మరీ ఇంత ఇదిగా రచ్చ చేయాలా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/