కరోనా వైరస్ ..ఈ మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈ తరుణంలోనే దేశంలోని పలు ముఖ్యమంత్రులు కరోనా తో కలిసి జీవించాల్సి ఉంటుంది ..దానికి తగ్గ ప్రణాళికలతో మనం ముందుకుపోవాలని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వారి మాటలు అక్షర సత్యమైయ్యేలా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ చాలా పక్కాగా అమలు చేస్తున్నప్పటికీ కూడా కరోనా భాదితులు రోజు గుంపులు గుంపులుగా బయటపడుతున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా భాదితుల సంఖ్య 46 వేలు దాటిపోయింది.
కాగా , తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి నివాసంలో కరోనా కలకలం రేపుతోంది. అశోక్ గెహ్లాట్ ఇంట్లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి వైరస్ బారిన పడ్డాడు. దీంతో అధికారులు అప్రత్తమయ్యారు. జైపూర్ బజాజ్ నగర్ కు చెందిన 59 ఏళ్ల వయసున్న అతడిని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందే అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు సెలవుపై ఇంటికి పంపించారు. మరోవైపు అతడు నివసించే జైపూర్‌లోని బజాజ్ నగర్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. అతడు ఎవరెవరిని కలిశారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు రాజస్థాన్ లో 3,061 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 77 మంది చనిపోయారు.