రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా రాజస్థాన్ కు చెందిన ఓ ఎమ్మెల్యే - తన నియోజకవర్గంలోని కొందరి ఇళ్లు కాలిపోతుంటే వాటి ముందు సెల్ఫీ దిగాడు. దానిని ఫేస్ బుక్ లో పోస్టు చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు. రాజస్తాన్ లోని భరత్ పూర్ జిల్లాలోని బయానా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బచ్చు సింగ్ ఈ విధంగా ఇరకాటంలో పడిపోయాడు.
బయానా పట్టణంలోని నగ్లా మోరోలి దాంగ్ అనే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. హుటాహుటిన తరలివెళ్లిన ఆయన, అన్ని విధాలా ఆదుకుంటామని బాధితులను ఓదార్చాడు. అధికారులకు ఈ మేరకు సూచించారు. అయితే ఎమ్మెల్యేగారు ఇక్కడితో ఆపేస్తే బాగానే ఉండేది. కానీ అదేమీ చేయకుండా అక్కడే నిలబడి సెల్ఫీ తీసుకుని, ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాప్రతినిధిగా ఎలా వ్యవహరించాలో తెలియకపోవడం శోచనీయమని పలువురు మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/