మిత్రపక్షాలు అయినప్పటికీ కలహాల కాపురానికి చిరునామాగా మారిన తెలుగుదేశం- బీజేపీల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇన్నాళ్లు మీడియాకే పరిమితం అయిన ఈ సంవాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యక్ష పంచ్ లకు వేదిక అయింది. సమావేశాల సందర్భంగా లాబీల్లో తెలుగుదేశం - బీజేపీ సభ్యుల మధ్య సరదా సంభాషణలు - మాటల యుద్ధం చోటు చేసుకుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి శిఖండిలా ఉండకుండా, విభీషణుడిలా వ్యవహరించాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజును టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కోరారు. దీనికి వీర్రాజు తనదైన శైలిలో రియాక్టయ్యారు. తాము ఐదుగురం ఉన్నామని - పాండవులమని - తాము మిత్ర ధర్మం పాటిస్తున్నామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. విభజన హామీలు - ఇచ్చిన నిధుల గురించి ఈ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. కర్నూలులో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయించాలని రాజేంద్ర ప్రసాద్ సూచించారు. పవన్ కల్యాణ్ వేసిన కమిటీల లాంటివి చాలా వస్తుంటాయని - గవర్నర్ ప్రసంగంపై తాము స్పందిస్తామన్నారు. ఎమ్మెల్సీ పదవి తాము ఇచ్చిన భిక్ష అని కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, తమ పార్టీ వదిలేయమంటే ఇప్పడే రాజీనామా చేస్తానన్నారు. తమకు ఓటు లేదు - నోటు లేదని టీడీపీ నేతలను ఎత్తిపొడిచారు.
ఇక బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిశాక - అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ - బీజేపీ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ - విష్ణుకుమార్ రాజు - ఎమ్మెల్సీ మాధవ్ ఒకసారి కనబడటంతో వివిధ అంశాలపై రెండు పార్టీలకు చెందిన ప్రతినిధుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రానికీ పొడిగించలేదని - ఏ రాష్ట్రానికి పొడిగించామో ఆధారాలు చూపించాలని సత్యనారాయణ కోరారు. కేవలం ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకే జీఎస్టీ మినహాయింపు ఇచ్చామని - దానిని హోదా పొడిగింపు అంటే ఎలా అని ప్రశ్నించారు. ఏపీకి కూడా ఆ విధమైన మినహాయింపు ఇవ్చొచ్చు కదా అని రాజేంద్ర అన్నారు. దీనిపై ఆకుల స్పందిస్తూ ఆ ఆలోచన ఉందని, తమ పార్టీ నేత అమిత్ షా ఈ విషయాన్ని చెప్పారన్నారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వెళ్లిన నిధులనే తిరిగి తమకు కేటాయిస్తున్నారని వ్యాఖ్యానించారు.
దీనిపై ఆకుల మాట్లాడుతూ ‘ మా గోదావరి నీళ్లను కృష్ణాకు తీసుకువెళ్లారని మేమూ అనగలము’ అంటూ ప్రతిస్పందించారు. ఉప ప్రాంతీయ స్థాయిలో ఆలోచనలు సరికాదని రాజేంద్ర ప్రసాద్ తిప్పికొట్టారు. తాము తెలుగుదేశం పార్టీలాగా అవాస్తవాలు చెప్పలేమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. బీజేపీ కాళ్ల మీద టీడీపీ నడుస్తోందన్న విధంగా మాట్లాడుతున్నారని అటుగా వెళ్తున్న కళా వెంకటరావుతో రాజేంద్ర ప్రసాద్ చెప్పగా, కళా స్పందించకుండా వెళ్లిపోయినా - టీడీపీ నేతలు తమ మనసులో మాట బయటపెట్టారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.