బాబును తిట్టిపోసిన ప్ర‌ముఖ మేధావి!

Update: 2017-11-26 04:32 GMT
ప్ర‌ముఖ మేధావి ఒక‌రు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యాల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. డాబుస‌రిగా బాబు చెప్పే మాట‌ల‌కు.. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు ఎంత అడ్డ‌గోలుగా ఉంటాయో ఉదాహ‌ర‌ణ‌లతో చెప్పిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తాను చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్ని గొప్ప‌గా చెప్పుకునే చంద్ర‌బాబు మాట‌లకు భిన్నంగా ప్ర‌ముఖుడి మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార‌హం.

హైద‌రాబాద్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ఆడిటోరియంలో ప్రారంభ‌మైన రెండు రోజుల అంత‌ర్జాతీయ శాశ్వ‌త వ్య‌వ‌సాయ స‌ద‌స్సు జ‌రిగింది.  రామ‌న్ మెగ‌సెసె అవార్డు గ్ర‌హీత‌.. జ‌ల యోధుడుగా ప‌లువురు కీర్తించే రాజేంద్ర‌సింగ్ మండిప‌డ్డారు. న‌దుల స‌మ‌జ ప్ర‌వాహాన్ని అడ్డుకోవ‌టం.. సార‌వంత‌మైన వ్య‌వ‌సాయ భూముల్ని రైతుల నుంచి లాక్కోవ‌టం లాంటి వికృత పోక‌డ‌ల‌కు ఏపీ నిల‌యంగా మారింద‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.

ఎండిపోయిన నదుల‌ను ద‌శాబ్దాల త‌ర్వాత మ‌ళ్లీ బ‌తికించామ‌ని.. అది సాధ్య‌మైన ప్ర‌క్రియగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇదే విష‌యాన్ని పాకిస్థాన్ లో తాము నిరూపించామ‌న్న ఆయ‌న‌.. ఏపీ ముఖ్య‌మంత్రి విధానాల్ని త‌ప్పు ప‌ట్ట‌టం గ‌మ‌నార్హం. తాను చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి నిత్యం గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబుకు భిన్నంగా ప్ర‌ముఖుడి మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News