పనిలో మజా రావడం లేదు.. అందుకే రిజైన్ చేస్తున్నా..

Update: 2022-06-21 00:30 GMT
కొందరు ఇష్టం లేకపోతే ఏ పని చేయలేరు. మరికొందరు ఇష్టం లేకపోయినా సరే పరిస్థితులకు తలవంచి నచ్చని పనిని చేస్తారు. కానీ రాజేశ్ మాత్రం మొదటి కోవకు చెందినవాడు. మంచి జీతం.. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సడెన్ గా మానేశాడు. రాజీనామా లెటర్ లో పనిచేస్తున్న చోట మజా రావడం లేదు.. అనే కారణం చెప్పాడు. ఈ కారణం చూసిన కంపెనీ షాక్ అయింది. అతణ్ని ఉద్యోగం వదులుకోకూడదని రిక్వెస్ట్ చేసింది. కానీ రాజేశ్ కు తెలుసు అది సిల్లీ రీజన్ కాదు.. చాలా సీరియస్ కారణం అని. అందుకే ఎవరి మాటా వినకుండా ఉద్యోగాన్ని వదులుకున్నాడు. దీనిపై సోషల్ మీడియా మోటివేటర్ హర్ష్ గోయెంకా తనదైన శైలిలో స్పందించాడు.

ఏ పనైనా ఇష్టపడి చేస్తేనే మజా వస్తుంది. ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రతిరోజు ఒకే పని చేస్తుంటే మజా ఎలా వస్తుంది. పనిలో ఉద్యోగులు కిక్ పొందాలంటే.. వారిలో ఉత్సాహం నింపే బాధ్యత యాజమాన్యాలది. ఉద్యోగులు ఆసక్తితో ఇష్టంగా పనిచేస్తేనే ఫలితాలు బాగుంటాయి. కానీ ఇప్పుడు కంపెనీలు దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఉద్యోగులు వస్తున్నారా..? టైంకి లాగిన్ అవుతున్నారా..?టార్గెట్ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేస్తున్నారా..? అంతే ఇంకేం పట్టించుకోవడం లేదు.

ఉద్యోగులు కూడా వెళ్తున్నామా..పని చేస్తున్నామా.. టైం అవ్వగానే ఇంటి బాట పడుతున్నామా..? అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అంతేకానీ.. ఇవాళ పనిని ఎంజాయ్ చేశామా..? పని చేస్తున్నప్పుడు మనకి మజా వచ్చిందా..? టార్గెట్ రీచ్ అయిన కిక్ ని ఫీల్ అవుతున్నామా.. అనేది అస్సలు కేర్ చేయడం లేదు.

కానీ రాజేశ్ అనే ఓ ఉద్యోగి తను పని చేస్తున్న చోట మజా దొరకడం లేదనే కారణంతో ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఓవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నానా అవస్థలు పడుతుంటే.. అగ్నిపథ్ కు నిరసనగా దేశమంతా నిరసన జ్వాలలు హోరెత్తుతోంటే.. రాజేశ్ రిజైన్ చేయడం చాలా మందికి సిల్లీగా అనిపించింది. కానీ దీనిపై హర్ష్ గోయెంకా స్పందించారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటూ.. సమకాలీన అంశాలపై స్పందించడంలో ఎల్లప్పుడూ ముందుండే హర్ష్.. రాజేశ్ రిజైన్ గురించి తెలియగానే సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఓవైపు రాజేశ్ రాజీనామాయే సెన్సేషన్ అవుతోందంటే.. దానిపై హర్ష్ రియాక్షన్ మరో సంచలనంగా మారింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ హర్ష్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..

మజా లేదనే కారణంతో ఉద్యోగాన్ని వదులుకోవడం చాలా సిల్లీగా అనిపించొచ్చు. కానీ దోస్తో.. అది చాలా సీరియస్ మ్యాటర్. పనిచేసే చోట ఉత్సాహం, ప్రోత్సాహం, స్ఫూర్తి లేదంటే అంది చాలా సీరియస్ గా పరిగణించాల్సిన విషయం. మీరు నెమ్మదిగా ఓ మొనాటినీకి అలవాటవుతారు. తర్వాత అది బోర్ గా మారుతుంది. ఆ సమయంలో జాబ్ ని వదులుకోలేక.. అలా అని పని చేయలేక డిప్రెషన్ కు గురవుతారు. ఇది కొందరిలో ఆత్మహత్యను కూడా ప్రేరేపిస్తుంది. పనిచేసే చోట ప్రోత్సాహం కల్పించాల్సిన బాధ్యత కంపెనీలది. ఇలాంటి సమస్యలు ఉంటే త్వరగా మీ టీమ్ లీడర్స్ తో చర్చించండి. తరచుగా టీమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోండి. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపుతూ ఎక్కువ ప్రొడక్టవిటీ తీసుకువచ్చేలా ప్లాన్ చేయాల్సిన బాధ్యత కంపెనీలదే అని హర్ష్ చెప్పారు.

జాబ్ ఉన్నప్పుడు ఎవరైనా అలాగే చేస్తారు బాస్.. లేని వాళ్లకే అసలు విలువ తెలుస్తుందంటూ సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇది నిజంగానే చాలా సీరియస్ ఇష్యూ.. హర్ష్ భయ్యా కరెక్ట్ గా చెప్పారంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. రాజేశ్ ఆల్ ది బెస్ట్.. ఫ్యూచర్ లో నీకు నచ్చిన .. కిక్ వచ్చే జాబ్ చేస్తూ ఎంజాయ్ చేయ్ అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
Tags:    

Similar News