నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల శంఖారావాన్ని విజయవాడలో నిర్వహించటం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా హాజరుకావటం తెలిసిందే.
ఈ సందర్భంగా తలైవా రజనీ చేసిన ప్రసంగం హైలెట్ గా మారింది. ఇంత పెద్ద సభలో రాజకీయం మాట్లాడొద్దని అనుభవం చెబుతుందని చెప్పిన రజనీ.. చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్న సభలో రాజకీయం గురించి మాట్లాడకపోతే ఏం బాగుంటుందంటూ.. తనదైన శైలిలో రాజకీయం గురించి మాట్లాడిన ఆయన మాటలుఅందరిని ఆకర్షించేలా ఉన్నాయి.
రజనీ ప్రసంగాన్ని యథావిధిగా చెబితే.
- ఇలాంటి పెద్ద సభలో నేను తెలుగు మాట్లాడి చాలా రోజులైంది. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో జ్ఞానం చెబుతుంది. ఎంత సేపు మాట్లాడా లో సభ చెబుతుంది. ఏం మాట్లాడకూడదో అనుభవం చెబుతుంది.
- మీ అందరిని చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనిపిస్తుంది. కానీ.. వద్దురా రజనీ అని అనుభవం ఆపుతోంది. అయినా నా ఆప్త మిత్రుడు.. రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొంచ మైనా రాజకీయం గురించి మాట్లాడకపోతే సరికాదు. ఆయనతో నాకు ముప్ఫై ఏళ్ల నుంచి పరిచయం ఉంది.
- ఆయన్ను నా మిత్రడు మోహన్ బాబు పరిచయం చేశాడు. త్వరలోనే పెద్ద నాయకుడు అవుతాడని చంద్రబాబు గురించి మోహన్ బాబు చెప్పాడు. పలు సందర్భాల్లో నేను చంద్రబాబు తో మాట్లాడటం వల్ల నా జ్ఞానం పెరిగింది. ఆయన ఇరవై నాలుగు గంటలుప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఉంటారు.
- ఆయనకు ఇండియన్ పాలిటిక్స్ మాత్రమేకాదు.. వరల్డ్ పాలిటిక్స్ కూడా తెలుసు. చంద్రబాబు ఘనత ఇక్కడ కంటే కూడా బయట వారికే బాగా తెలుసు. ఆయన ఘన పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు తెలుసు. ఐటీ గురించి ఎవరికి ఏమీ తెలియని రోజుల్లోనే అదే.. ఫ్యూచర్ అని ఆయన చెప్పారు.
- హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చారు. బిల్ గేట్స్ లాంటి ఎందరో ప్రముఖుల్ని.. వారి కార్యాలయాల్ని తీసుకొచ్చారు. ఇవాళ విదేశాల్లో లక్షలాది తెలుగు వారు పని చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబే. ఈ రోజున ఇంత లగ్జరీ గా బతుకుతున్నారంటే అది చంద్రబాబే కారణం.
- ఈ మధ్యన సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాను. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ పక్కనున్న ప్రాంతాలకు రాత్రి వేళలో వెళ్లాను. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆటు వైపు వెళ్లాను. అక్కడున్నవి చూసినప్పుడు నేను ఇండియాలో ఉన్నానా? న్యూయార్కులో ఉన్నానా? అన్నది నాకు అర్థం కాలేదు.
- విజన్ 2020 అంటూ అప్పట్లోనే చంద్రబాబు చెప్పారు. ఆయన ప్లాన్ వేసిన 2047ను అనుకున్నది అనుకున్నట్లు అమలు జరిగితే ఆంధ్రప్రదేశ్ స్థానం ఎక్కడికో వెళుతుంది.