లెజెండ్స్ ఇంత లేట‌య్యారే!

Update: 2018-11-01 13:14 GMT
డాక్ట‌ర్ కాబోయే యాక్ట‌ర్ లు అయిన వారి గురించి వినే ఉంటాం. అలాగే యాక్ట‌ర్లు అయిన త‌ర్వాత పొలిటిషియ‌న్లుగా మారిన వారి గురించి విన్నాం. కానీ, న‌టుల నుంచి రాజ‌కీయ నాయ‌కులుగా మారిన వారంతా స‌క్సెస్ కాలేదు. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన వారు కూడా ...రాజ‌కీయ చద‌రంగంలో చ‌తికిలబ‌డ్డ సంద‌ర్భాలు అనేకం. అయితే, తాజాగా త‌మిళ‌నాడులో డెమీగాడ్స్ గా పేరు పొందిన క‌మ‌ల్ హాస‌న్ - ర‌జ‌నీకాంత్ ల ప‌రిస్థితి కూడా విడుద‌ల‌కు నోచుకోని సినిమా ప‌రిస్థితిలా ఉంది. అంత‌న్నాడింత‌న్నాడే ...గంగ‌రాజు...త‌ర‌హాలో...త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతామ‌ని చెప్పిన ఈ ఇద్ద‌రు స్టార్లు ...ప్ర‌స్తుతం సుప్త చేత‌నావ‌స్థ‌లో ఉన్నారు. మ‌రో ఆరు నెల‌ల్లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు స‌మీపిస్తోన్నా...20 నియోజ‌క‌వ‌ర్గాల్లో అసెంబ్లీ ఉప ఎన్నిక‌లు జ‌రిగ‌బోతోన్నా....వారిద్దూ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు....వ్య‌వ‌హ‌రించ‌డం రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు కూడా విస్మ‌యం క‌లిగిస్తోంది.

త‌మిళ‌నాట క‌మ‌ల్ - ర‌జ‌నీల పొలిటిక‌ల్ ఎంట్రీ ఓ మెగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ను త‌ల‌పించిన సంగ‌తి తెలిసిందే. అదిగో పులి...ఇదిగో తోక త‌ర‌హాలో దాదాపు రెండేళ్లు ఊరించిన త‌ర్వాత‌....క‌మ‌ల్ పార్టీ పెట్టి సైలెంట్ అయ్యారు. ఇక‌, రజనీకాంత్ లేట్ గా వ‌చ్చినా లేటెస్ట్ గా వ‌స్తా అన్న త‌ర‌హాలో....జ‌స్ట్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి ఊరుకున్నారు. కానీ, వీరిద్ద‌రూ....త‌మ త‌మ సినిమాల షూటింగ్ ల‌లో మాత్రం బిజీబిజీగా ఉన్నారు. మ‌రోవైపు, త్వ‌ర‌లో త‌మిళ‌నాట 20 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నా...వీరిద్ద‌రికీ ప‌ట్ట‌డం లేదు. ఓవైపు అన్ని పార్టీలు...ఆ స్థానాల‌ను కైవ‌సం చేసుకునేందుకు వ్యూహాలు ర‌చిస్తుంటే...వీరిద్ద‌రూ..మీన‌మేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికైనా ఆల‌స్యం కాలేదు. ఆ సుప్త చేత‌నావ‌స్థ‌లోనుంచి  వీళ్లిద్దరూ బ‌య‌ట‌కు వ‌స్తేనే..త‌మిళ ప్ర‌ల‌ల‌లో వారిపై ఉన్న‌ గౌర‌వం నిలుపుకుంటారు. లేదంటే ఆ స్టార్ హీరోలు కాస్తా...పొలిటిక‌ల్ జీరోలుగా మారతార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి, లెజెండ్స్ లేటుగా అయినా లేటెస్టుగా వ‌స్తారా...లేదంటే...సినీ లెజెండ్స్ గానే మిగిలిపోతారా అన్న‌ది తేలాల్సి ఉంది.
Tags:    

Similar News