క‌న్న‌డ రాజకీయంపై ర‌జ‌నీ కామెంట్..

Update: 2018-05-20 09:42 GMT
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్‌ సుదీర్ఘ‌కాలం త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చారు. ఇవాళ చెన్నైలో తన ఇంట్లో పలువురు మహిళలతో రజనీకాంత్ సమావేశమయ్యారు. అనంత‌రం ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత అధికారం కోసం బీజేపీ.. కాంగ్రెస్ - జేడీఎస్ మధ్య జరుగుతున్న యుద్ధం కొన్ని రోజులుగా దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ - కాంగ్రెస్ ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని మరింత రక్తికట్టించాయి. చివరికి అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ అధికారంతోపాటు తమ పార్టీ పరువు, ప్రతిష్టను కూడా పోగొట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

క‌న్న‌డ డ్రామాపై తమిళ సూపర్‌ స్టార్ - త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్న రజనీకాంత్ స్పందించి ప్రజాస్వామ్యమే గెలిచిందని అన్నారు. `సుప్రీంకోర్టు సరైన సమయంలో స్పందించినందుకు కృతజ్ఞతలు. ఇవాళ కోర్టు ఆదేశాల వల్లే ప్రజాస్వామ్యం గెలిచింది` అని రజనీకాంత్ అన్నారు. బల నిరూపణ కోసం బీజేపీ సమయం అడగటం, దానికి గవర్నర్ 15 రోజుల సమయం ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. బీజేపీకి కాస్త అనుకూలుడిగా పేరున్న రజనీ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. ఇక 2019 ఎన్నికల్లో తాము పోటీ చేస్తామా లేదా అన్నది ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాతే నిర్ణయిస్తామని, ఇప్పుడే దానిపై స్పందించడం తొందరపాటు అవుతుందని రజనీ అన్నారు. పార్టీని ఇంకా ఆవిష్కరించనేలేదు. కానీ మేం దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఇక పొత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం కూడా సరికాదు అని ఆయన స్పష్టంచేశారు.
Tags:    

Similar News