రజనీ అభిమానులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. తమ హీరో పొలిటికల్ ఎంట్రీ కోసం ఏళ్ల తరబడి చూస్తున్న అభిమానులకు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. రజనీ పొలిటికల్ ఎంట్రీ మీద కొన్నేళ్లుగా ఆసక్తికర చర్చ జరుగుతున్నా.. ఆయన మౌనంగానే ఉన్నారు. ఈ మధ్యనే రాజకీయాల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
ఇలాంటి వేళ.. రజనీపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి చేస్తున్న విమర్శలు తలైవా ఫ్యాన్స్ కు మంట పుట్టిస్తున్నాయి. ఓపక్క బీజేపీ నేతలు రజనీని రాజకీయాల్లోకి రావాలని వినతుల మీద వినతులు చేస్తుంటే..మరోవైపు సుబ్రమణ్యస్వామి మాత్రం రజనీపై తీవ్రస్థాయిలో మండిపడటం సరికాదంటున్నారు.
రజనీ ఆర్థిక నేరస్తుడని.. అతడు రాజకీయాల్లోకి రాకూడదంటూ సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనానికి కారణమయ్యాయి. స్వామి వ్యాఖ్యలపై కోపంగా ఉన్న తలైవా అభిమానులు.. తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. తనను విమర్శించే వారిపై బహిరంగంగా ఆందోళనలు చేపట్టకూడదని రజనీ చెప్పటంతో.. స్వామి మీద తమకున్న కోపాన్ని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. రజనీపై విమర్శలు చేసిన స్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
రజనీని విమర్శించటం మానుకోకుంటే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందన్న వార్నింగ్ లు ఇస్తున్నారు. అదే సమయంలో నోటిని అదుపులో పెట్టుకునేలా స్వామిని కట్టడి చేయాలంటూ బీజేపీ నేతలకు వారు సూచిస్తున్నారు. రజనీని విమర్శించటం మానుకోకపోతే తీవ్రంగా రియాక్ట్ కావాల్సి వస్తుందని స్వామిని హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ హెచ్చరిస్తున్నారు. ఫేస్ బుక్.. ట్విట్టర్ వేదికగా చేసుకొని రజనీ అభిమానుల బృందం.. ప్రపంచ రజనీ అభిమాన సంఘాలకు చెందిన వారు స్వామిపై విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు.
ఢిల్లీలో కూర్చున్న సుబ్రమణ్యస్వామి ఎవరిని పడితే వారి మీద ఆరోపణలు చేస్తుంటారని.. విమర్శలు గుప్పిస్తారని ఒక అభిమాని మండిపడితే.. మరో అభిమాని కాస్తంత సున్నితంగా రియాక్ట్ అవుతూ.. రాజకీయాల్లో పెద్దోడిగా ఉంటూ ఇదేంటీ ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటే తీవ్రంగా స్పందించాల్సిందిగా గణేషన్ అనే అభిమాని హెచ్చరించారు. తమ నాయకుడి మీద తమకున్న అభిమానంతో ఆగుతున్నామని.. తమ మీద తలైవా విధించిన ఆంక్షలు కట్టి పడేశాయని లేకుంటే తామేంటో చేతల్లో చేసి చూపించేవాళ్లమంటున్నారు.
రజనీని రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానిస్తున్న బీజేపీ నేతలు స్వామిని ఎందుకు కట్టడి చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. నిజంగా రజనీ మీద అభిమానం ఉంటే స్వామి మీద చర్యలు తీసుకోవాలంటూ బీజేపీని కోరుతున్నారు రజనీ అభిమానులు. మరి.. దీనిపై బీజేపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/