ఇవాల్టి రోజున అగ్రతారలంతా ఒక సినిమా తర్వాత మరొకటన్న సూత్రాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. ఒకరిద్దరూ తప్పించి అగ్రశ్రేణి కథానాయకులంతా ఒకటి తర్వాత మరొకటన్న రూల్ ని ఫాలో అవుతున్న పరిస్థితి. ఇందుకు భిన్నంగా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం అందుకు భిన్నంగా ఒకేసారి రెండు సినిమాలకు ఓకే చెప్పేశారు.
ఈ రెండు సినిమాల షూటింగ్ నిమిత్తం ఆయన బిజీబిజీగా ఉంటూ.. షెడ్యూల్ అడ్జెస్ట్ మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఆయన అభిమానుల డిమాండ్ మరోలా ఉంది. కొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ ని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్న వినతుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రజనీ రాజకీయ అరంగ్రేటం కోసం ఆయన అభిమానులు పోస్టర్ల మీద పోస్టర్లు వేసేస్తున్నారు.
రజనీ కానీ రాజకీయాల్లోకి రాకుంటే తాము నిరాహారదీక్షలు చేస్తామంటూ రజనీకాంత్ అభిమాన సంఘాల సమాఖ్య ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో తన రాజకీయ అరంగ్రేటాన్ని ప్రకటించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. మరోవైపు.. ఈ విషయాలపై రజనీ నోరు మెదపటం లేదు. ఆయన మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వాల పని తీరుతో విసిగిపోయామని.. ఈసారి ఎన్నికల బరిలో రజనీ రంగప్రవేశం చేయాలన్న డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. మరి.. దీనిపై సూపర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతారో..?