ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానేవచ్చింది. అమ్మ జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడ్డ రాజకీయ శూన్యతకు తెరదించేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం సాగింది. కానీ ఆయన ఒక అడుగు ముందుకు..వెనక్కు అంటూ నాన్చుతూ వస్తున్నాడు.
తమిళనాడు అసెంబ్లీకి మరో రెండేళ్లలోపే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు ఎన్నికల బరిలో దిగబోతున్నాడని.. ఆయన సోదరుడు సత్యనారాయణ రావు ప్రకటించారు. కడలూరు జిల్లా శ్రీముష్ణం భూవరాహాస్వామి ఆలయాన్ని దర్శించుకున్న రజినీకాంత్ సోదరుడు అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి రజినీకాంత్ సిద్ధపడుతున్నారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పోటీచేయరని రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు తెలిపారు. మరో రెండేళ్లలోనే రజినీకాంత్ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని.. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆయన తెలిపారు.
ఇలా తన సోదురుడు రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన సోదరుడు చేసిన ప్రకటన ఇప్పుడు తమిళ రాజకీయాలను షేక్ చేస్తోంది. రజినీ వస్తే మాత్రం తమిళ రాజకీయమే పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.