రజినీ క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశాడు

Update: 2017-03-23 07:00 GMT
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ భావజాలంపై.. ఆయన రాజకీయారంగేట్రంపై తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేయబోతున్నాడని గత కొన్ని నెలలుగా విస్తృత ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో అది కొంచెం తగ్గినా.. ఇటీవల ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్ రజినీని కలిసి ఫొటో దిగడంతో మళ్లీ ఈ ప్రచారం ఊపందుకుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గంగై అమరన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

గంగై అమరన్ రజినీని కలిసి ఆత్మీయంగా ఫొటో దిగడం.. అది మీడియాలో వైరల్ కావడంతో ఉప ఎన్నికల్లో రజినీ మద్దతు భాజపాకే అని అందరూ ఒక అంచనాకు వచ్చేశారు. గంగై అమరన్ కూడా అలాగే ప్రచారం చేసుకున్నాడు. ఐతే తన ప్రమేయం లేకుండా తన పేరును భాజపా వాడేసుకుంటుండటంతో రజినీ స్పందించక తప్ప లేదు. రాబోయే ఎన్నికల్లో తన మద్దతు ఏ పార్టీకి లేదంటూ ట్విట్టర్లో స్పష్టత ఇచ్చారు రజినీ. ఒకే ఒక్క ముక్కలో వ్యవహారాన్ని ముగించేశాడు రజినీ. సూపర్ స్టార్ సైలెంటుగా ఉంటే ఆయన పేరు చెప్పుకుని ఓట్లు రాబడదామని చూసిన భాజపాకు రజినీ ప్రకటన షాకే. తమ పార్టీలోకి రావాలని భాజపా గత ఎన్నికల ముందు నుంచి రజినీని కోరుతోంది. జయ మరణం తర్వాత కూడా ఆయనపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన తలొగ్గట్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News