దేవుడు ఆదేశిస్తే సూపర్ స్టార్ పాలిటిక్స్ లోకి..

Update: 2016-09-05 05:33 GMT
‘‘నా దారి రహదారి’.. ‘‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే’’.. ‘‘రావాల్సిన సమయానికి సరిగ్గా వస్తాను’’.. ‘‘కబాలి రా..’’అంటూ వెండి తెర మీద తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పే డైలాగులు సగటు సినీ ప్రేక్షకులు తమను తాము మరిచిపోతుంటారు. ఆయన చెప్పే డైలాగుల్లోని ‘మర్మాన్ని’ అర్థం చేసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ ఎంట్రీ మీద చాలానే ఊహాగానాలు జోరుగా సాగుతుంటాయి. అయితే.. అందులో నిజానిజాలు అందరికి తెలిసినవే. అప్పుడెప్పుడో రజనీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ వచ్చినమాటలు సంచలనం సృష్టించాయి. చాలానే అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అవేమీ వర్క్ వుట్ కాలేదు.

కాలక్రమంలో రజనీ రాజకీయాల్లోకి వస్తారన్నది ఒక అపనమ్మకంగా మారిపోయింది. ఓ పక్క అనారోగ్యం.. మరోపక్క వయసు మీద పడుతున్న వేళ.. తన తీరుకు భిన్నంగా ఉండే రాజకీయాల్లోకి రజనీ ఎంట్రీ ఇస్తే నెట్టుకు రాగలరా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజకీయాల్లోకి వచ్చే అంశంపై ఎప్పుడూ సూటిగా మాట్లాడని రజనీ తీరు చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. పాలిటిక్స్ లోకి ఆయన రావాలన్న ఆసక్తి ఉన్నా.. వచ్చాక తానెంతగా రాణిస్తారన్న సందేహం ఆయన వెంటే ఉండటం ఆయన పొలిటికల్ ఎంట్రీ సాధ్యం కాలేదని చెప్పాలి.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన దీనికి కారణంగా చెప్పాలి. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సన్నిహితుడు రజనీతో భేటీ అయ్యారు. అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ వ్యవస్థాపకుడైన పొన్ రాజ్.. రజనీని కలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ఎప్పటిలానే రజనీ రియాక్ట్ అవుతూ..దేవుని చిత్తం అదే అయితే అలాగే జరుగుతుందన్న సమాదానం చెప్పినట్లుగా చెబుతున్నారు..రెండు దశాబ్దాలుగా రజనీ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో..తనకు తానే కొత్త పార్టీ పెట్టుకునే సత్తా ఉన్న సూపర్ స్టార్.. ఎవరో పెట్టిన పార్టీలోకి ఆయన వెళ్లటమా?
Tags:    

Similar News