ఓ పక్క కమల్ హాసన్....మరోపక్క రజనీకాంత్.....వీరిద్దరి రాజకీయ అరంగేట్రంతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ పార్టీ గుర్తు - విధివిధానాలు - పేరు...ఇతరత్రా విషయాలను వీరిద్దరూ వెల్లడించనప్పటికీ తదుపరి కార్యచరణపై ప్రణాళికలు రచిస్తున్నారు. వామపక్ష భావజాలానికి దగ్గరగా కమల్.....బీజేపీకి దగ్గరగా రజనీ ఉన్నారని టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఇద్దరు తమిళ సూపర్ స్టార్ లు ఏ పార్టీకి మద్దతు ఇవ్వరని .....ఎవరికి వారు సొంత ఎజెండాపైనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నారని వినికిడి. తాజాగా జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న తలైవాకు మీడియా నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కమల్ తో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానమిస్తుందని జవాబిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ ఆరు నెలల్లోపు ఎన్నికల బరిలో దిగేందుకు కూడా సన్నద్ధమవుతున్నామని రజనీకాంత్ తెలిపారు. అయితే, ఎన్నికలలో తాము అనుసరించే వ్యూహాల గురించి త్వరలోనే స్పష్టతనిస్తామన్నారు.
సహ నటుడు - సన్నిహితుడు కమల్ హాసన్ తో రాజకీయాల్లో స్నేహం చేస్తారా అన్న ప్రశ్నకు.....కాలమే సమాధానమిస్తుందని `కాలా` బదులిచ్చారు. తమ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆఫీస్ బేరర్ల నియామకం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 21న తన పార్టీ పేరు ప్రకటించి - అదే రోజు రాష్ట్రవ్యాప్త పర్యటనను తలైవా ప్రారంభించబోతున్నారని పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కమల్ కూడా తన పార్టీపై మరింత క్లారిటీ ఇచ్చి ఎన్నికల బరిలో దిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా, ఈ ఇద్దరు స్టార్ హీరోలు రెండు కత్తుల వంటి వారని....వారిద్దరూ ఒక ఒరలో ఇమడవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, కమల్ తో పొత్తు పెట్టుకునే ఉద్దేశం రజనీకి లేకపోతే ఆ ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చి ఉండేవాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయినా, అనిశ్చితికి మారుపేరైన రాజకీయాల్లో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో...ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకుంటారో చెప్పడం కష్టమని మరి కొందరి వాదన. ఏది ఏమైనా....`కాలా` చెప్పినట్టు....కమల్ తో దోస్తీపై కాలమే సమాధానం చెబుతుంది. అప్పటివరకు వేచి చూడక తప్పదు!