తమిళనాట రాజకీయాల్లో మార్పులు తెచ్చేందుకు తరలి వస్తున్నానంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా తన రాజకీయ అరంగేట్రంపై నడుస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఎపిసోడ్ కు తలైవా తెరదించారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ పెట్టబోతున్నానని చెప్పిన రజనీ....ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలవారీగా అభిమాన సంఘాలతో చర్చలు జరుపుతున్న తలైవా....పార్టీ గుర్తు, జెండా, ఎజెండాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తలైవా పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తన పార్టీ ఎన్నికల చిహ్నంగా సైకిల్ ను రజనీ ఎంచుకోబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీకి అత్యంత కీలకంగా భావించే గుర్తుపై తలైవా ఫోకస్ పెట్టారని....సైకిల్ గుర్తును సులభంగా ప్రజలు గుర్తించే చాన్స్ ఉంది కాబట్టి దానికే మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ కూడా సైకిల్ గుర్తుతో తెలుగునాట ప్రభంజనం రేపారు. అదే తరహాలో తలైవా కూడా సైకిల్ ఎక్కి తమిళనాట చరిత్ర సృష్టించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఆల్రెడీ దేశంలోని కొన్ని పార్టీల ఎన్నికల చిహ్నంగా సైకిల్ ఉంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ, యూపీలో సమాజ్ వాదీ పార్టీ గుర్తు సైకిలే. దీంతోపాటు, చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ గా డీఎంకే, అన్నాడీఎంకేల తరఫున కొందరు పోటీ చేస్తున్న సందర్భంలో అక్కడి గుర్తులు వాడుతుంటారు. తమిళనాడులోని చిత్తూరు సరిహద్దుల్లో కొంతమంది టీడీపీ సైకిల్ గుర్తు వాడుకుంటారు. ఎన్నికల సంఘం దగ్గర ఎలాంటి గుర్తింపు లేకపోయినా తమది జాతీయ పార్టీ అని టీడీపీ చెబుతుంది. ఈ నేపథ్యంలో తలైవా సైకిల్ గుర్తుపై టీడీపీ ఏమన్నా అభ్యంతరం చెబుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అసలు, తలైవా...సైకిల్ గుర్తుతోనే ముందుకు వెళతారా అన్నది అధికారికంగా వెల్లడైతేనే ఈ వ్యవహారంపై స్పష్టత వస్తుంది. ఆటో కాదు...‘సైకిల్’ ఎక్కనున్న ‘బాషా’ ... అన్నగారి బాటలో తలైవా....అదే పార్టీ గుర్తా? ... ‘అన్న’గారి మాట చద్ది మూట అంటున్న తలైవా ....అన్న కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి.