లేటయిపోయింది.. లేటెస్టుగా వచ్చేస్తా: రజనీ

Update: 2017-12-26 05:00 GMT
తాను రాజకీయాల్లో రావాలా వద్దా అనేది దేవుడి నిర్ణయిస్తాడని చెబుతూ వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి రావడానికి ఇప్పటికే ఆలస్యం చేశానని అన్నారు. అభిమానులతో సమావేశంలో రజనీ మాట్లాడుతూ రాజకీయాలు తనకి కొత్తకాదని పేర్కొన్నారు. నేను రాజకీయాల్లోకి రావడమంటే విజయం సాధించినట్టేనని అన్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశం మారోసారి చర్చనీయమవుతోంది.
    
గత మే నెలలో ఒకసారి అభిమానులతో సమావేశాలు నిర్వహించిన ఆయన ఆ తరువాత సైలెంటయ్యారు. అయితే... మరోసారి ఇప్పుడు అభిమానులతో ఆరు రోజుల పాటు భేటీ కానుండడంతో తమిళనాట రాజకీయ అంచనాలు మొదలవుతున్నాయి. సమావేశాలు పూర్తియన వెంటనే డిసెంబర్ 31న రజనీ రాజకీయ పార్టీపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. ఈ సమావేశాల్లో రోజుకు వెయ్యి మంది అభిమానులను రజనీ కలవనున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఊహించని ఫలితాలు రావడంతో రజనీ మళ్లీ జనంలోకి రావాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
    
అభిమానులతో మాటామంతీ సందర్భంగా రజనీ అనేక అంశాలపై మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తన సినీ - జీవిత అనుభవాలను ఆయన గుర్తు చేసుకుంటున్నారు. చిత్ర రంగంలోకి హీరో అవ్వాలని రాలేదని - అభిమానులే తనను హీరోను చేశారని రజనీ అన్నారు. హీరోగా తన తొలి సంపాదన రూ.50వేలని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి రావాలంటే లాభనష్టాలు - లోతుపాతులు బేరీజు వేసుకోవాలని - యుద్ధంలో గెలవాలంటే వీరత్వం ఒక్కటే కాదు.. వ్యూహం ఉండాలని రజనీ తెలిపారు.
Tags:    

Similar News