సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పొలిటికల్ జర్నీని వేగవంతం చేయబోతున్నారు. జయలలిత మరణం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్ - రజనీకాంత్ తమిళ రాజకీయాలలో కీలకంగా మారనున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే కమల్ తన పార్టీ పేరు ఎజెండా ప్రకటించగా - రజనీకాంత్ అతి త్వరలోనే ఆయన పార్టీపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల హిమాలయాలకి వెళ్ళిన వచ్చిన తలైవా తన పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే పార్టీ ఎజెండాతో పాటు విధి విధానాలని కూడా వివరించనున్నారని కోలీవుడ్ టాక్. దీంతో రజనీ రాబోయే సినిమాల కన్నా ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది.
వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 31న ప్రకటించారు. పొలిటికల్ ఎంట్రీ విషయంపై ఎంతో సస్పెన్స్ సృష్టించిన రజనీ...హిమాలయాల పర్యటన తర్వాత దాన్ని వేగవంతం చేశారని సమాచారం. పార్టీకి సంబంధించి కొత్తగా నియమితులైన కార్యాలయ-బేరర్లు తమిళనాడు అంతటా 65,000 పోలింగ్ బూత్‌లలో రజినీ మక్కల్ మండ్రం శాఖలను తెరవడం ఆసక్తిగా మారింది. ఒక్కో బూత్ బ్రాంచ్ లో 30 మంది సభ్యులు ఉండేలా రజనీకాంత్ ప్లాన్ చేశారట. ప్రతి జిల్లాలో కార్యదర్శి - కో-సెక్రటరీ - జిల్లా ఉప కార్యదర్శులు - న్యాయవాదుల వింగ్ - రైటర్స్ వింగ్ - మహిళల విభాగాల ప్రతినిధులు ఉంటారు. 38 జిల్లా విభాగాల్లో కనీసం 15 మంది ఆఫీస్ బియరర్స్ నియమించబడి వారు గ్రామీణ, యూనియన్, టౌన్ పంచాయితీ యూనిట్లలోను పాలు పంచుకోనున్నారు.
రజనీకాంత్ తన పార్టీకి ‘మక్కల్ మంద్రమ్’ అనే పేరుని పెట్టబోతున్నాడని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక పార్టీకి సంబంధించిన మెంబర్స్ మరియు డిస్ట్రిక్ట్ యూనిట్స్ వారికి ఐడెంటిటీ కార్డ్స్, రిజిస్ట్రేషన్స్ సర్టిఫికెట్స్ జారీ చేయడం జరుగుతుంది. పార్టీ నిర్మాణం రూపొందించే పూర్తి బాధ్యతని లైకా ప్రొడక్షన్స్ మాజీ అధినేత రాజు మహలింగం మరియు అభిమానుల సంఘం నాయకుడు సుధాకర్‌కి రజనీకాంత్ అప్పగించినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆయన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.