తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికరమైన విషయం ఒకటి వెళ్లడించారు. విప్లవనాయకి పేరొందిన జయ ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక ఒకసారి తాను కీలక పాత్ర పోషించానని రజినీ ప్రకటించారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామిల సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో రజనీకాంత్ మాట్లాడుతూ తన వ్యాఖ్యల వల్లే 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత ఓటమి పాలయ్యారని అన్నారు.
ఈ సందర్భంగా రజినీ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తమిళనాడు సీఎం జయలలితకు వ్యతిరేకంగా తాను చేసిన కామెంట్లను ప్రస్తావించారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ జయలలిత తిరిగి గెలిస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడని ఆనాడు తాను వ్యాఖ్యానించినట్లు రజినీ తెలిపారు. అనంతరం ఫలితాల్లో జయ సారాథ్యంలోని అన్నాడీఎంకే ఓటమి పాలవ్వడంతో జయ బాధపడ్డారన్నారు. ఆ తర్వాతే ఆమె మంచి మనస్సున్న నేతగా ఆవిర్భవించారన్నారు. నాటి ఎన్నికల్లో డీఎంకే-టీఎంసీ (తమిళ మనీలా కాంగ్రెస్) కూటమి ఘన విజయం సాధించాయి. పురుషాధిక్య సమాజంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ఎదిగిన జయ ఒక కోహినూర్ వజ్రం అని రజినీ కాంత్ కొనియాడారు. ఎమ్‌జి రామచంద్రన్ తర్వాత రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న జయలలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయాలను నమోదు చేసుకున్నారన్నారు. జీవితంలో ఎదురైన సవాళ్లే జయలలితలో పట్టుదలను పెంచాయని, రెండో ఏటే తండ్రిని, 20 తర్వాత తల్లిని కోల్పోయిన జయలలిత సొంత కుటుంబమంటూ లేకుండానే పురుషాధిక్య సమాజంలో రాణించారని..కృషి, పట్టుదలతోనే తిరుగులేని స్థాయికి చేరుకున్నారని రజినీకాంత్ తెలిపారు. చో రామస్వామికి కూడా నివాళులర్పించిన రజనీ ఆయన తనకు సుదీర్ఘకాలంగా స్నేహితుడని చెప్పారు.