కొత్తగా భాద్యతలు తీసుకున్న ఎయిర్ ‌ఫోర్స్ ఆఫీసర్లకు రాజ్‌ నాథ్ ఏంచెప్పారంటే

Update: 2020-12-19 16:30 GMT
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది. ఆ పెరేడ్ కి ముఖ్య అతిధిగా వచ్చిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ భవిష్యత్తు- రక్షణ కోసం శిక్షణ పూర్తి చేసుకున్న ఎయిర్‌ఫోర్స్ అధికారులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్ మాట్లాడుతూ.. క్యాడెట్ల నుండి కమీషన్డ్ ఆఫీసర్లుగా బాధ్యతలు చేపట్టబోతున్న వారికి అభినందనలు. ఈ రోజు నేను చూసిన పరేడ్ ఎక్సలెంట్‌గా ఉంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు నిత్యం సిద్ధంగా ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ గోల్డెన్ ‌జూబ్లీ జరుపుకొంటుంది. ఇందుకోసం మరింత ముందుకు సాగాలి.

ఈ ఆకాడమీ ఎంతో మంది వీరులను దేశానికి అందించింది. గతంతో పోల్చితే ఇండియన్ ఎయిర్ పోర్స్ అధునాతన యంత్రాంగం కలిగి ఉంది. ట్రాన్సిపేరేషన్-అగ్రేషన్ ఉన్న దేశం భారత దేశం. ప్రపంచ దేశాలతో శాంతి నెలకొల్పే దేశం భారతదేశం. పాకిస్థాన్ ఉగ్రవాదుల కేసుల్లో విచారణలు జరుపుతోంది. రఫెల్ యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్‌కి మరింత బలం ఇచ్చింది అని తెలిపారు.

శత్రువులను చీల్చి చెండాడడంలో వాయుసేన సాహసాలు ప్రదర్శించడమే కాకుండా గోల్డెన్ రికార్డులు సృష్టించారు. అకాడమీలో ఇప్పటి వరకు పొందిన అనుభవం వేరు భవిష్యత్తులో జరిగే పరిణామాలు వేరు. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సిద్ధంగా ఉండాలి. శాంతి మన నినాదం. మన దేశ సార్వభౌమత్వంపై ఎవరైనా మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. ఉగ్రవాదంపై సైన్యం ఎనలేని పోరు చేస్తోంది. సరిహద్దులోనే కాదు సరిహద్దు దాటి మరి తమ ధైర్య సాహసాలను ప్రదర్శించింది. బాలకోట్‌లో జరిగిన ఉదాంతం అందరికి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది అని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడేట్లు పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్నారు. పరేడ్ ముగిసిన తరువాత అధికారులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎయిర్ ఫోర్స్‌ లో పలు నగరాల్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. యాలంక ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పైలెట్ క్యాడేట్లు శిక్షణ పూర్తి చేయనున్నారు.
Tags:    

Similar News