అవును అలాగే జరుగుతోంది. ఇప్పటిదాకా అలాగే కధ నడిపించారు. ఇక మీదట కూడా అదే జరగాలి. బీజేపీలో ఒక్కో సీనియర్ నేతా మెల్లగా తప్పుకుంటున్నారు. కాదు తప్పిస్తున్నారు. ఇది వరిష్ట నేత లాల్ క్రిష్ణ అద్వానీతో మొదలైంది. వెంకయ్యనాయుడుతో జోరందుకుంది లేటెస్ట్ గా నితిన్ గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు వంటి అత్యున్నత కమిటీ నుంచి పక్కన పెట్టినపుడే వరస సరిగ్గా సరిపోయింది.
అయితే ఇపుడు ఆ లిస్ట్ లో తరువాయి పేరు మీద ఇటు బీజేపీలోనూ అటు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలలోనూ చర్చ బాగా సాగుతోంది. బీజేపీలో ఒక్క మోదీ తప్ప అంతా జాతీయ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేతలే. నితిన్ గడ్కరీ బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కేంద్రంలో సుదీర్ఘ కాలం మంత్రిగా వివిధ శాఖలను చూశారు. ఆయనకు మంచి పేరుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో పట్టుంది.
అన్నిటికీ మించి ఆరెస్సెస్ ఆయనకు బాగా మద్దతు ఇస్తోంది. ఇలా నాగ్ పూర్ కి అత్యంత సన్నిహితుడిగా వున్న గడ్కరీ మోడీకి డైరెక్ట్ గానే పోటీదారు. ఇప్పటికి రెండు సార్లు ప్రధానిగా మోడీ పదవి అందుకున్నారు. అయితే బీజేపీకి ఫుల్ మెజారిటీ రాబట్టే అది సాగింది. 2014 ఆ అద్భుతం సాగింది. 2019లో కూడా మరోసారి కొనసాగింది. అయితే 2019లో బీజేపీకి మెజారిటీ రాకపోతే గడ్కరీ ప్రధాని అవుతారని, మిత్రుల మద్దతుతో ఆయన ముందుకు వస్తారని నాడు బలంగా వినిపించింది
దాంతో నాటి నుంచే ఆయన మీద ఒక కన్నేసిన మోడీ అమిత్ షా ద్వయం మెల్లగా ఆయనను బీజేపీ అత్యున్నత వేదిక నుంచి సాగనంపింది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదని మోదీ షా భయపడుతున్నారు. అలా జరిగితే బీజేపీకి మద్దతు ఇచ్చే మిత్రుల పాత్ర కీలకం అవుతుంది. వారు మోడీని ప్రధానిగా కంటే నితిన్ గడ్కరీకే ఓటు వేసి మరీ ఎన్నుకుంటారు. అందుకే రేసులో ఆయన లేకుండా చేసుకున్నారు అని అంటున్నారు.
ఇక ఇపుడు మరో పోటీదారు మిగిలిపోయారు అని అంటున్నారు. ఆయనే కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్. ఆయనకు కూడా తొందరలో సైడ్ దారి చూపిస్తారు అని ప్రచారం అయితే ఎక్కువగా సాగుతోంది. రాజ్ నాధ్ కూడా సీనియర్ మోస్ట్ నేత. యూపీ సీఎం గానే కాకుండా బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ గా పనిచేశారు. కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖలు చూస్తున్నారు. ఆయన కూడా ప్రధాని రేసులో ఉంటారని టాక్ నడుస్తోంది. దాంతో ఆయన అడ్డు కూడా తొలగించుకునే ప్లాన్ ఒకటి సిద్ధం చేసి ఉంటారని అంటున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీలో 75 ఏళ్ళు దాటిన వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదు అన్న రూల్ ఉంది. అది మోడీ వచ్చాకనే పెట్టారు. అయితే 2024 నాటికి 75 ఏళ్ళు నిండినా కూడా మూడవసారి మూడవసారి ప్రధాని అయ్యేందుకు ఎలాంటి ఆటంకం ఉండబోదు అంటున్నారు. ఎందుకంటే అది మోడీ షాలు తెచ్చిన రూల్ ఎదుటివారి కోసమే తప్ప తమ కోసం కాదని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు అందరి చూపూ రాజ్ నాధ్ సింగ్ మీదనే ఉంది. ఆయన సైడ్ ఎలా అవుతారో ఎలా చేస్తారో వెండి తెర మీద చూడాల్సిందే.