ఓట్ల రాజకీయాలకు పాల్పడుతూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే రీతిలో సాగుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చేలా కేంద్ర హోం శాఖ మంత్రి అనూహ్య క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. బెంగుళూరులో జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై క్లారిటీ ఇచ్చారు. "విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్ల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. అయితే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటే రాజ్యాంగంలోని 171వ అధికరణలోని మూడవ నిబంధనను సవరించవలసి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీట్ల సంఖ్య పెంపు కుదరదు - జనాభా లెక్కల ప్రకారం 2026 నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. అప్పుడే అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుంది" అని ఆయన తేల్చి చెప్పేశారు.
బెంగుళూరు విధానసౌధలో జరిగిన 28వ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించగా కర్ణాటక - పాండిచ్చేరి ముఖ్యమంత్రులు కుమారస్వామి - నారాయణస్వామి - తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం - ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు - కేరళ - తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయడంతో టీడీపీ నేతల నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లయిందని అంటున్నారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అనేకమంది ఎమ్మెల్యేలు - నియోజకవర్గాల్లోని నేతలు తమ పార్టీలను వీడి పచ్చపార్టీకి వచ్చేలా అధికార పార్టీ చక్రం తిప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు - సీట్ల ఖరారు పెద్ద సమస్యగా మారగా...ఇపుడు నియోజక వర్గాల పునర్విభజన నేతలకు షాక్ గా మారింది. తాజా పరిణామాలతో అన్నీ మంచి శకునములే అనుకున్న ఆ పార్టీ నేతలు కాస్త నారాజ్ అయిపోయారని అంటున్నారు. ఇన్నాళ్లు అధికార పార్టీ ఊరించిన ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాఫ్టర్ ముగిసినట్లేనని, తమ రాజకీయ భవిష్యత్‌ను గందరగోళంలో పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.