దేశ వ్యాప్తంగా కలకలాన్ని రేపిన కేరళ నిర్భయ ఉదంతంపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ రియాక్ట్ అయ్యారు. సామూహిక అత్యాచారంతో పాటు.. అత్యంత పాశవికంగా హత్య చేయటంపై రాజ్ నాథ్ మాట్లాడుతూ.. బాధిత విద్యార్థినికి తాము తప్పక న్యాయం చేస్తానని చెప్పారు. కేరళలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘కేరళ నిర్భయ’ ఉదంతం ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. నిర్భయ ఉదంతాన్ని ప్రస్తావించిన రాజ్ నాథ్.. మహిళలకు సురక్షితంగా ఉండే కేరళను.. ఎల్ డీఎఫ్.. యూడీఎఫ్ ప్రభుత్వం తమ అసమర్థ పాలనతో కేరళ గౌరవాన్ని ప్రశ్నార్థకం చేసినట్లుగా విమర్శలు చేశారు.
మరోవైపు కేరళ నిర్భయ ఉదంతం రాజకీయ అస్త్రంగా మారి ప్రభుత్వంపై దాడి చేయటానికి విపక్షాలకు అస్త్రంగా మారటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అలెర్ట్ అయ్యారు. తాజాగా ఆయన బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించటమే కాదు.. ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఒక మహిళకు జరిగిన అన్యాయంపై తాము మాత్రమే న్యాయం చేస్తామని చెప్పే రాజ్ నాథ్ కు ఏపీ ప్రజలు ఒకసూటి ప్రశ్న సంధిస్తున్నారు.
ఒక మహిళకు జరిగిన అన్యాయానికి తాము మాత్రమే న్యాయం చేస్తామని గొప్పలు చెప్పే రాజ్ నాథ్.. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని తాము భర్తీ చేస్తామని.. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆదుకుంటామని ఇదే తరహాలో చిలకపలుకులు పలకటం మర్చిపోలేం. నిజంగా మేలు చేసే తత్వమే ఉండి ఉంటే.. ఐదు కోట్ల ఆంధ్రుల కష్టం విషయంలో సానుకూలంగా ఎందుకు స్పందించనట్లు..? కోట్లాది మంది ఎదుట పార్లమెంటులో ఇచ్చిన హామీని నేరవేర్చే విషయంలోనే మీనమేషాలు లెక్కించే బీజేపీ నేతలు..ఒక్కరి విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా? అన్నది ప్రశ్నగా చెప్పొచ్చు.