తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆరెస్ పార్లమెంటరీ - శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది... హైకోర్టు విభజన - కొత్త జిల్లాల ఏర్పాటు - సాగునీటి ప్రాజెక్టులపై పార్టీ నేతలు చర్చించారు.. హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీలో జరుగుతున్న ఈ సమావేశం సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు.. అంతలోనే ఆయన ఫోన్ మోగింది. ఒక్క నిమిషం పాటు ఫోన్ మాట్లాడిన కేసీఆర్ ఆ వెంటనే మీడియా సమావేశాన్ని మధ్యలోనే ఆపేసి హెచ్ ఐసీసీ నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లిపోయారు. దీంతో కేసీఆర్ కు ఎవరు ఫోన్ చేశారు..? ఆయన ఎక్కడకు వెళ్లారన్నది ఒక్కసారిగా చర్చనీయాంశమైపోయింది. అయితే.. ఆ వెంటనే ఆయన రాజభవన్ కు వెళ్లారని తెలియగానే ఎవరికి వారు తమకు తోచింది ఊహించుకున్నారు. అయితే.. కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ నుంచి ఫోన్ రావడంతోనే కేసీఆర్ హడావుడిగా రాజభవన్ కు పరుగులు తీశారని అంటున్నారు.
రాజ్ భవన్ కు చేరుకున్న కేసీఆర్ అక్కడ గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు. ఉమ్మడి హైకోర్టు విభజన - న్యాయశాఖలో ప్రాథమిక కేటాయింపులపై వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులకు జరుగుతున్న అన్యాయం - తాజా పరిణామాలను గవర్నర్ కు కేసీఆర్ వివరించారు. అయితే.. రాజనాథ్ కేసీఆర్ తో ఏం మాట్లాడారు.. ఆయన ఎందుకు అంత హడావుడిగా గవర్నరును కలిసేందుకు వెళ్లారన్నది మాత్రం తెలియరాలేదు. మొత్తానికి కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుందని.. న్యాయాధికారుల వివాదానికి తెర దించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిందని చెబుతున్నారు
మరోవైపు తెలంగాణలో న్యాయవాదులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. హైకోర్టుకు భారీ సంఖ్యలో న్యాయవాదులు బయలుదేరారు. అయితే, వారిని మదీనా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదుల ఆందోళన దృష్ట్యా హైకోర్టు వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. వరంగల్ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు.