కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రాఫెల్ అంటే... మోదీ బోఫోర్స్ అనడానికి బదులుగా రాజీవ్ గాంధీ అన్నారు. అక్కడే ఆయన బోల్తా పడిపోయారన్న వాదన వినిపింది. రాజీవ్ గాంధీ చనిపోయేనాటికి అవినీతి చక్రవర్తి అని - ఐఎన్ ఎస్ విరాట్ ను విలాసాల కోసం వినియోగించారని మోదీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్లే ఇవ్వగా... రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారు కూడా మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు మోదీకి సొంత పార్టీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. వీరిలో మోదీకి అత్యంత సన్నిహితుడిగానే కాకుండా బీజేపీతో సీనియర్ మోస్ట్ నేతగా ముద్రపడిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా మోదీని తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనమే రేపుతున్నాయి. మోదీ పేరును ప్రస్తావించకుండానే.. మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిపోయాయి.
అయినా రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారన్న విషయానికి వస్తే... *ఏ రాజకీయ పార్టీకి చెందిన ప్రధానిని ఉధ్దేశించి నేను ఎప్పుడూ అభ్యంతరకరంగా మాట్లాడలేదని అన్నారు. దేశ రాష్ట్రపతి - ప్రధానమంత్రి అంటే వ్యక్తులు కాదు... వారు ఒక వ్యవస్థతో సమానం. రాష్ట్రపతి - ప్రధానిల స్థాయి బలంగా ఉండేందుకు ప్రజలంతా కృషి చేయాలి. ఈ రెండు వ్యవస్థలు బలహీనమైతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. ప్రజాస్వామ్యం బలహీనపడితే దేశ విభజన నుంచి ప్రపంచంలోని ఏ శక్తి మనలను రక్షించలేదు. ఏ పార్టీ అయినా దేశానికి ఏమీ చేయలేదని నేను ఎన్నడూ చెప్పను. ప్రతి పార్టీ దేశం కోసం తన వంతు ఎంతో కొంత చేస్తుంది. కాకపోతే పని చేసే విధానాల్లోనే తేడా ఉంటుంది* అని రాజ్ నాథ్ తన మనసులోని మాటను సూటిగానే సుత్తిలేకుండా చెప్పేశారు. ఇక్కడ రాజ్ నాథ్... మోదీ పేరును ఎక్కడా ప్రస్తావించకున్నా... రాజీవ్ పై మోదీ చేసిన వ్యాఖ్యలు తప్పేనన్న అర్థం వచ్చేలా మాట్లాడారని చెప్పక తప్పదు.