దాయాదికి దిమ్మ తిరిగేలా రాజ్ నాథ్‌ వార్నింగ్

Update: 2018-03-18 06:00 GMT
రాజ‌కీయంగా త‌మ‌కు తిరుగులేనట్లుగా ఫీలైన బీజేపీ నేత‌ల‌కు.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో మారుతున్న రాజ‌కీయ ముఖచిత్రం క‌మ‌ల‌నాథుల్లో క‌ల‌క‌లాన్ని రేపుతోంది. ఇదిలా ఉంటే.. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ ఊహించ‌ని రీతిలో సీరియ‌స్ అయ్యారు.

దాయాది పాక్ కు దిమ్మ తిరిగేలా వార్నింగ్ ఇచ్చారు. అవ‌స‌ర‌మైతే భార‌త బ‌ల‌గాలు పాక్ స‌రిహ‌ద్దుల్ని దాటేస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. క‌శ్మీర్ ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌కు ముప్పు వాటిల్లుతుంద‌ని భావిస్తే.. చూస్తూ ఊరుకోమ‌ని రాజ్ నాథ్ స్ప‌ష్టం చేశారు. పాకిస్తాన్‌ తో తాము స్నేహాన్ని ఆశిస్తామ‌ని.. కానీ పాక్ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు.

తాజాగా ఒక ఛాన‌ల్ నిర్వ‌హించిన రైసింగ్ ఇండియా స‌మ్మిట్ లో ఆయ‌నీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఐక్య‌రాజ్య స‌మితి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ముద్రేసిన ల‌ష్క‌రే తాయిబా అధినేత హ‌ఫీజ్ ను పాక్ నెత్తిన పెట్టుకుంటుంద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేసిన రాజ్ నాథ్.. జ‌మ్ముక‌శ్మీర్ ఎప్ప‌టికీ భార‌త్ లో అంత‌ర్భాగంగా ఉంటుంద‌న్నారు.

క‌శ్మీర్ భార‌త్ లో అంత‌ర్భం. ఇప్ప‌టికే కాదు.. భ‌విష్య‌త్తులోనూ ఉంటుంది. క‌శ్మీర్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ భార‌త్ నుంచి వేరు అయ్యే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. తేడా వ‌స్తే పాక్ స‌రిహ‌ద్దుల్ని దాటేస్తామంటూ రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.
Tags:    

Similar News