ప్రపంచం మొత్తం విపత్తుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాల్సి వచ్చిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడ్డాయి. ఈ పోలింగ్ సందర్భంగా సాధారణ పరిస్థితుల్లో చోటు చేసుకోని కొన్ని సీన్లు కనిపించాయి. ఫలితాల విషయానికి వస్తే.. మొత్తం పది రాష్ట్రాల్లో 18 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధికం బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. అందరూ ఊహించినట్లే ఏపీలో జరిగిన నాలుగు స్థానాల్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. బలం లేకున్నా బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ అభాసుపాలు కాక తప్పలేదు.
గుజరాత్ లో జరిగిన నాలుగు సీట్లకు బీజేపీ మూడింటిని సొంతం చేసుకుంటే.. విపక్ష కాంగ్రెస్ కు ఒక్క సీటు దక్కింది. మధ్యప్రదేశ్ లో మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు.. కాంగ్రెస్ ఒక స్థానాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ నుంచి జ్యోతిరాదిత్య సింధియా.. సుమేర్ సింగ్ సోలంకి ఎన్నిక కాగా.. కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్ ఎన్నికలయ్యారు.
రాజస్థాన్ లో జరిగిన మూడు స్థానాల ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నరెండు స్థానాల్ని కాంగ్రెస్ సొంతం చేసుకోగా.. ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. జార్ఖండ్ లో రెండు సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒకటి.. జేఎంఎం మరొకటి సొంతం చేసుకున్నాయి. మేఘాలయలో ఒక్కస్థానానికి జరిగిన ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి ఖార్లూకీ ఎన్నిక కాగా.. మిజోరాంలో ఒక్క స్థానాన్ని మిజో నేషనల్ ఫ్రంట్ కైవశం చేసుకుంది.