దేశంంలో మరో ఎన్నికల నగారా మోగింది. గత కొన్ని రోజులుగా దేశంలోని అన్ని పార్టీలు , ప్రముఖ నేతలు ఎదురుచూస్తున్నా ఆ సమయం వచ్చేసింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటంచింది. దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అలాగే నామినేషన్ల పరిశీలన 16న, ఉపసంహరణకు తుదిగడువు 18వ తేదీగా ఈసీ నిర్ణయించింది.
ఇకపోతే ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో కేవీపీ, గరికాపాటి రాంమోహన్ రావు పదవీకాలం ముగియనుండగా , ఏపీలో కూడా కే కేశవరావు, ఏంఏ ఖాన్, టి. సుబ్బిరామిరెడ్డి, తోట సీతరామలక్ష్మీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనితో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17 రాష్ట్రాల్లో మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.