రాజ్యసభ సభ్యులు ఆ బ్యాడ్జిలు పెట్టుకొవచ్చు

Update: 2016-06-04 04:51 GMT
జాతీయ జెండాతో కూడిన బ్యాడ్జిలు తెలుసుగా. ఇలాంటివి తమ కోటుకు పెట్టుకొని పార్లమెంటుకు వెళ్లటానికి సభ్యులకు అనుమతి లేదు. ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం కోటుకు పెట్టుకునే పిన్ను రూపంలో ఉన్న జాతీయ జెండా బ్యాడ్జిని పెట్టుకొని రాజ్యసభకు రావటానికి అనుమతి లేదు. అయితే.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న వినతులు వస్తున్న నేపథ్యంలో తాజాగా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.

దీని ప్రకారం.. జాతీయ పతాకాన్ని గౌరవించేలా కోటుకు బ్యాడ్జి పెట్టుకోవటాన్ని రాజ్యసభ సభ్యులకు అనుమతిస్తూ తాజాగా నిర్ణయాన్ని వెల్లడించారు. లోక్ సభ సభ్యులకు ఈ అనుమతి 2010లోనే రాగా.. రాజ్యసభ సభ్యులకు మాత్రంగా తాజాగా లభించటం గమనార్హం. నిజానికి ఈ విధానం గతంలో అమల్లో ఉన్నా.. 1985లో ఈ విధానానికి మంగళం పాడుతూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత జాతీయ జెండా బ్యాడ్జిని పిన్నురూపంలో కోటుకు పెట్టుకునే వెసులుబాటు పెద్దల సభ సభ్యులకు దక్కినట్లైంది.
Tags:    

Similar News