పశ్చిమబెంగాల్ కు చెందిన సీపీఎం ఎంపీ ఒకరు ఊహించని రీతిలో పార్టీ నుంచి సస్పెండయ్యారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటో తెలుసా? ప‌్రపంచమంతా క్రేజ్ చూపిస్తున్న యాపిల్ వాచ్ ను చేతికి ధరించడమే ఆయన చేసిన తప్పు. ఆ నేరానికి పార్టీ ఆయన్ను ఏకంగా మూణ్నెళ్ల పాటు బహిష్కరించింది.
సీపీఎం సిద్ధాంతాల ప్రకారం హంగులు, ఆర్భాటాలకు నేతలు దూరంగా ఉండాలి. సామన్యుల్లా నిరాడంబరంగా ఉండాలి. కానీ... రితబ్రత బెనర్జీ అనే ఆ ఎంపీ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. హాయిగా తనకు నచ్చినట్లు ఉంటున్నారు. లేటెస్టు గాడ్జెట్లంటే ఆయనకు తగని మక్కువ. యాపిల్ కొత్త ఫోన్ లాంచ్ అయితే చాలు, అది ఆయన చేతుల్లో ఉండాల్సిందే. అలాగే చేతికి ధరించే వాచీ కూడా యాపిల్ వాచే. దీనిపై పార్టీ పెద్దలకు మరికొందరు నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వామపక్ష భావజాలానికి విభిన్నంగా ఆయన జీవనశైలి ఉందనే కారణంతో రితబ్రత బెనర్ పై బహిష్కరణ వేటు వేసింది సీపీఎం. ఆయన ఎక్కువగా హై-టెక్, ఖరీదైన గాడ్జెట్లను వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఖరీదైన ఆపిల్ వాచ్, లగ్జరీ మోంట్ బ్లాంక్ పెన్ (రూ.15వేల పైన నుంచి రూ. 60వేల రూపాయల మధ్యలో రేటు) వాడి బెనర్జీ ఇరకాటంలో పడ్డారు. సాకర్ మ్యాచ్ చూస్తూ ఖరీదైన యాక్ససరీస్ ధరించిన బెనర్జీ ఫోటోలను సీపీఎం నేత సుమిత్ తాల్కుదార్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అప్పట్లో దుమారం చెలరేగింది. దీనిపై కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ విచారణ జరిపి ఎంపీపై సస్పెన్షన్ వేటు వేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/