ఫిరాయింపు రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ పై హైదరాబాద్ లో భూకబ్జా కేసు నమోదైంది. బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 10లో విలువైన అర్ధఎకరం స్ధలాన్ని అక్రమించేందుకు ఎంపీ సోదరుడి కొడుకు విశ్వప్రసాద్ ప్రయత్నించినపుడు గోల జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో వీళ్ళపై కేసు నమోదైంది. ఇంతకీ విషయం ఏమిటంటే 2005లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కుకు ప్రభుత్వం రెండున్నర ఎకరాల స్ధలాన్ని కేటాయించింది.
ఆ సంస్ధ తమ భూమిలో నిర్మాణాలు చేయగా ఇంకా అర్ధఎకరా ఖాళీగానే ఉంది. ఈ అర్ధఎకరా రోడ్డుకు అనుకునే ఉండటంతో దాని ప్రస్తుత విలువ సుమారు రు. 100 కోట్లుంటుంది. ఈ ఖాళీ స్ధలం తమదే అంటు కొందరు టీజీ విశ్వప్రసాద్ కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు.
ఎలాగూ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయింది కాబట్టి స్వాధీనం చేసుకునేందుకు విశ్వప్రసాద్+90 మంది ఆయుధాలు తీసుకుని స్ధలంలోకి ఎంటరయ్యారు. దాంతో అంతమంది ఆయుధాలు తసుకుని రావటంతో ఆ ప్రాంతంలో పెద్ద గోలైంది.
విశ్వప్రసాద్ మనుషులు స్ధలంలోకి ఎటరవ్వటమే సదరు స్ధలమంతా తమదే అంటు అక్కడున్న సెక్యురిటీ వాళ్ళని కొట్టారు. దాంతో విషయం పెద్ద అల్లరైంది. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకోగానే కొందరు పారిపోయారు.
దొరికిన 63 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. ఆయుధాలను, వాహనాలను పోలీసులు స్వాదీనం చేసుకుని విచారించారు. దీంతో ఈ గొడవ ప్రమేయంవెనుక టీడీపీలో నుండి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్+ఆయన సోదరుడి కొడుకు విశ్వప్రసాద్ ఉన్నట్లు బయటపడింది.
వెంటనే పోలీసులు ఎంపీతో పాటు విశ్వప్రసాద్ అండ్ అదర్స్ అంటు మరో 90 మందిపైన కూడా కేసులు నమోదుచేశారు. చుట్టుపక్కలున్న సీసీఫుటేజీలను తెప్పించుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తానికి ఫిరాయింపు ఎంపీల్లో సీఎం రమేష్ ఏమో ఫుట్ పాత్ ను ఆక్రమించి తన స్ధలంలో కలిపేసుకుంటారు, టీజీ వెంకటేష్ ఏమో సంబంధంలేని స్ధలాన్ని ఆక్రమించేందుకు మనుషులను పంపారు. మరి పోలీసులు నమోదుచేసుకున్న కేసు చివరకు ఏమవుతుందో చూడాలి.