రాజ్యసభకు లోకేష్ ..కేంద్రంలో మంత్రి ?!

Update: 2016-01-11 05:43 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నుండి త్వరలోనే రాజ్యసభ సభ్యుడుగా ఎంపిక కానున్నారా ? తెలుగుదేశం పార్టీ వర్గాలలో జోరుగా సాగుతున్న ఈ ప్రచారం ప్రకారం ఈ వార్త నిజమే అని తెలుస్తోంది. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు, మొన్నటిదాకా చంద్రబాబు పేషీలో ఉండి రాజీనామా చేసిన అభీష్ట ఢిల్లీలో ఓ అపార్ట్ మెంట్ తీసుకోవడమే సంకేతం అని అంటున్నారు.

లోకేష్ ఏపీలో మంత్రి అవుతారని అంతా అనుకున్నారని, అయితే ఆయన టీడీపీ కోటాలో కేంద్రమంత్రి కాబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల సుజనా చౌదరికి - పార్టీకి దూరం పెరిగిందని, ఆయన స్థానంలో లోకేష్ మంత్రి అవుతారని, రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, అందుకే లోకేష్ అక్కడ, చంద్రబాబు ఇక్కడ ఉంటే పాలనతో పాటు పార్టీ మీద గట్టి పట్టు ఉంటుందని భావిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఈ మూడేళ్ల అనుభవం లోకేష్ కు భవిష్యత్ రాజకీయాల మీద పట్టు సాధించడానికి ఉపయోగ పడుతుందని, జాతీయ స్థాయి నేతల పరిచయాలు ఉంటే తన కుమారుడి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీ నుండి రెండు రాజ్యసభ స్థానాలు వెంకయ్యనాయుడు - నిర్మలా సీతారామన్ కు పోతుండగా, మిగిలిన ఒక్కటీ చినబాబుకేనని చెబుతున్నారు.
Tags:    

Similar News