ల‌లిత్‌ మోడీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Update: 2015-08-14 15:43 GMT
వివాదాస్ప‌ద ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్‌ మోదీ చుట్టూ ఉచ్చ బిగుస్తోంది. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉంటున్న ఆయ‌నకు త్వ‌ర‌లో రెడ్ కార్న‌ర్ నోటీసులు పంపుతామ‌ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ స‌హాయ మంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్‌ సింగ్ రాథోడ్ తెలిపారు. ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తినా గ‌త ప్ర‌భుత్వం ఒక్క‌టంటే ఒక్క కేసు కూడా న‌మోదు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేవ‌లం దేశ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకే ఆరాట‌ప‌డుతోంద‌ని పెద‌వివిరిచారు.

అనేకానేక ఆర్థిక‌నేరాల్లో చిక్కుకుని బ్రిట‌న్‌ లో ఆశ్ర‌యం పొంది ఉంటున్న మోడీని వెన‌క్కుర‌ప్పించాలన్న చిత్త‌శుద్ధి కాంగ్రెస్‌కు లేద‌న్నారు. ఉంటే దేశీయంగా ఉన్న విమానాశ్ర‌యాల్లో మాత్ర‌మే లైట్ బ్లూ కార్న‌ర్ నోటీసులు జారీచేసి ఊరుకునేది కాద‌ని మండిప‌డ్డారు.ఇక‌పై ఆయ‌న ఆట‌లు చెల్ల‌వ‌ని, ఇప్ప‌టికే త‌మ ప్ర‌భుత్వం నాన్‌ బెయిల్‌ బుల్ వారెంటుజారీ చేసింద‌ని గుర్తుచేశారు.

కాగా.. ల‌లిత్ మోడీ వ్య‌వ‌హారంలో సుష్మా, వ‌సుంధర‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన నేప‌థ్యంలో పార్ల‌మెంట్ అట్టుడికి పోయింది. బీజేపీని టార్గెట్‌ గా చేసుకుని యువ‌నేత రాహుల్ త‌న‌దైన వాగ్ధాటితో విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా.. రంగంలోకి మాజీ షూట‌ర్ రాజ్య‌వ‌ర్థ‌న్ దిగ‌డంతో సీన్ యూ ట‌ర్న్ తీసుకున్నట్లైంది.
Tags:    

Similar News