ప‌తంజ‌లి కండోమ్స్ ప్రారంభించండి: రాఖీ సావంత్

Update: 2017-12-25 12:06 GMT
ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల మ‌ధ్యలో(ప్ర్రైమ్ టైమ్) టీవీలో కండోమ్ యాడ్స్ ప్ర‌సారంపై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఆ యాడ్స్ ఎందుకు ప్ర‌సారం చేయ‌కూడ‌దో తెల‌పాలంటూ కేంద్ర ప్రసార‌ - స‌మాచార శాఖ‌కు - కేంద్ర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీకి - కేంద్ర ఆరోగ్య శాఖ సెక్ర‌ట‌రీకి రాజ‌స్థాన్ హైకోర్టు నోటీసులు పంపింది. అశ్లీల‌త అధికంగా లేని యాడ్ల‌ను ఆ స‌మ‌యాల్లో ప్ర‌సారం చేసుకోవ‌చ్చ‌ని - త‌మ కండోమ్ ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు పెరిగేందుకు మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా రూపొందించిన యాడ్ల‌కు మాత్ర‌మే ఆ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని రాజ‌స్థాన్ హైకోర్టుకు కేంద్ర ప్రసార‌ - స‌మాచార శాఖ బ‌దులిచ్చింది. ఈ కండోమ్ స‌మ‌యాల నిషేధంపై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా - బాలీవుడ్ ఐట‌మ్ బాంబ్ రాఖీ సావంత్ ఈ అంశంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆ నిషేధం నిర్ణయాన్ని త‌ప్పుబ‌డుతూ కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డింది.

గ‌తంలో దేశంలో ఎయిడ్స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో కండోమ్ ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం అనేక ప్ర‌క‌ట‌న‌ల‌ను గుప్పించింది. రాహుల్ ద్రావిడ్ వంటి సెల‌బ్రిటీలు కూడా దాని ఆవ‌శ్య‌క‌త‌ల‌ను తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. వైన్ షాపుల ద‌గ్గ‌ర కూడా కండోమ్ ల‌ను ఉచితంగా అందించారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల వద్ద ఉచిత‌ కండోమ్ బాక్సుల‌ను అందుబాటులో ఉంచింది. దీంతో, చాలామందికి కండోమ్ ల‌పై  - ఎయిడ్స్ మ‌హ‌మ్మారి పై అవ‌గాహ‌న వ‌చ్చింది. అటువంటిది ప్ర‌స్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం....దేశంలో ఎయిడ్స్  - సుఖ వ్యాధులు ప్ర‌బ‌లేలా ఉంద‌ని రాఖీ మండిప‌డింది. అంత‌టితో ఆగ‌కుండా....ప్ర‌ముఖ యోగా గురు - ప‌తంజ‌లి సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు రామ్ దేవ్ బాబాపై రాఖీ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. 2014 నుంచి త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని వేల కోట్ల‌కు విస్త‌రించిన బాబా రాందేవ్....కండోమ్స్ ఉత్పత్తిని ప్రారంభించాల‌ని రాఖీ కోరింది. కొత్త జంట విరాట్ - అనుష్క శ‌ర్మ ల‌కు కూడా రాఖీ ఓ ఉచిత స‌ల‌హా ప‌డేసింది. తాను ప్రమోట్ చేస్తున్న కండోమ్ ను విరాట్ వాడ‌డ‌మే కాకుండా...ఎలా ఉందో చెప్పాల‌ని నిస్సిగ్గుగా చెప్పింది. మ‌రి రాఖీ కామెంట్ల‌పై రాందేవ్ - విరుష్క‌లు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Tags:    

Similar News