రీల్ కాదు రియల్ కథ.. ఆ ఊళ్లో రాఖీ కడితే చావేనా?

Update: 2020-08-03 18:02 GMT
విన్నంతనే ఏదో సినిమా కథలా అనిపించినా ఇది నిజంగా నిజం. ఇదో ఊరి భయం. అంతకు మించిన నమ్మకం. దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ వచ్చిందంటే.. అన్నాచెల్లెలు.. అక్కా తమ్ముడు.. కలిసి పండుగ చేసుకునే రాఖీ పర్వదినం. అందరు సంతోషంగా చేసుకునే పండుగ.. ఆ గ్రామంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. రాఖీ వచ్చిందంటే చాలు.. వణికిపోతారు. భయంతో గజగజలాడతారు. రాఖీ పేరు ప్రస్తావించేందుకే హడలిపోతారు.

ఎందుకిలా? ఇంతకూ కారణం ఏమిటి? ఆ ఊరు ఎక్కడుంది? లాంటి సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. ఆ ఊరు ఉత్తరప్రదేశ్ లోని వజీరాగంజ్ పంచాయితీలోని జగత్ పూర్వ అనే చిన్న ఊరు. అందులో 20 కుటుంబాలు ఉంటాయి. గడిచిన ఆరు దశాబ్దాలుగా ఆ ఊరు రాఖీని చూడలేదు. అంతే కాదు.. ఆ రోజు ఇంట్లో నుంచి ఏ ఒక్కరు బయటకు రావటానికి ఇష్టపడరు. ఒకవేళ.. వచ్చినా భయం.. భయంగా బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్లిపోతారు. ఆ గ్రామానికి చెందిన మిశ్రా అనే వ్యక్తి చెప్పిన వివరాలు నమ్మశక్యంగా అనిపించవు.

1955లో రాఖీ రోజున ఒక యువకుడు అనుమానాస్పదంగా మరణించాడు. ఇది కీడుకు సంకేతంగా భావించి రాఖీ పండుగను ఆ ఊళ్లో చేసుకోవటం మానేశారు. ఇదంతా ఉత్త భ్రమ.. మూఢ నమ్మకంగా తలచి.. పదేళ్ల క్రితం ఊళ్లో మరోసారి రాఖీ పండుగ నిర్వహించాలని డిసైడ్ చేశారు. అనుకోని రీతిలో ఆ రోజున కూడా అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది.

దీంతో.. రాఖీ పండుగ జరపాలనుకోవటం ఊరికి ఏ మాత్రం మంచిది కాదని భావించిన ఊరి వారు.. అప్పటి నుంచి ఆ పండుగను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదని డిసైడ్ అయ్యారు. ఏదో ప్రతికూల శక్తి తమ ఊరిని వెంటాడుతుందని.. రాఖీ పండుగ రోజు పసిబిడ్డ జన్మనిస్తే.. ఆ ఊరుకు పట్టిన శాపం పోతుందన్న నమ్మకంతో ఆ ఊరి వారి మాటల్లో కనిపిస్తుంది. అలాంటి రోజు కోసం ఆ ఊరి వారు వెయిట్ చేస్తున్నారు.
Tags:    

Similar News