చాలా అరుదుగా జరిగే పరిణామంగా చెప్పాలి. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తమకు వద్దంటూ పెద్ద ఎత్తున ర్యాలీని ఊహించగలమా? ఈ ప్రశ్నను ఎవరినైనా అడిగితే లేదని చెబుతారు. కానీ.. ఇలాంటి పరిస్థితి ఏపీలో నెలకొంది. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. ఏపీ అధికారపక్షానికి పెద్ద ఎత్తున ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
ఇటీవల ఒకరి తర్వాత ఒకరు చొప్పున అధికారపక్షం నుంచి విపక్షంలోకి వెళ్లటం పెను సంచలనంగా మారటమే కాదు.. బాబు సర్కారుకు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీని నిర్వహించటం సంచలనంగా మారింది.
ఈ ర్యాలీలో నియోజకవర్గ ప్రజల కంటే కూడా మహిళా సర్పంచులు.. మండల అధ్యక్షులు.. మాజీ జెడ్పీటీసీ.. ఎంపీటీసీలు ర్యాలీని నిర్వహించారు. ఇప్పటికే ఎమ్మెల్యే అనితపై నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు భారీగా వీస్తున్నాయన్న మాట వినిపిస్తున్న వేళలోనే.. ఈ ర్యాలీ ఆమెకే కాదు.. అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారినట్లు చెప్పక తప్పదు.
ఇటీవల ఒకరి తర్వాత ఒకరు చొప్పున అధికారపక్షం నుంచి విపక్షంలోకి వెళ్లటం పెను సంచలనంగా మారటమే కాదు.. బాబు సర్కారుకు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీని నిర్వహించటం సంచలనంగా మారింది.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ర్యాలీ తీయటం ఒక ఎత్తు.. రానున్న ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ డిమాండ్ చేయటం గమనార్హం. అంతర్గత కలహాలు ప్రతి పార్టీలో ఉండేవే అయినా.. మరీ ఇంత స్థాయిలో బజారున పడటం.. నిరసన ర్యాలీలు తీసే వరకూ వెళ్లటం మాత్రం టీడీపీకే సాధ్యమన్న మాట వినిపిస్తోంది.