వివాదాలు కొత్తేం కాదు. వివాదాస్పదంగా మాట్లాడటం..వార్తల్లో ఉండటం కామనే. పాలిటిక్స్ గురించి కాస్త తక్కువగామాట్లాడుతూ..వ్యక్తిగతంగా ఎవరినైనా..ఎప్పుడైనా..ఏ విషయం మీదనైనా వివాదాస్పదంగా రియాక్ట్ కావటంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా.తాజాగా తనదైన వ్యాఖ్యలతో చెలరేగిపోయారు వర్మ. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారటమే కాదు..రాజకీయ పక్షాల నుంచి భారీ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొన్నటికి మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలంతా సన్నీలియోన్ ని తీసుకోవాలంటూ తింగరి ట్వీట్ చేసిన వర్మ.. తాజాగా మోడీని ఉద్దేశిస్తూ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం గమనార్హం. పనిలో పనిగా..తన తాజా చిత్రమైన సర్కార్ 3ను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు.ఇంతకీ వర్మ చేసిన ట్వీట్ లోకి వెళితే..
మోడీ సర్కరు కంటే తాను తీసిన.. సీనియర్ బచ్చన్ నటించిన సర్కార్ 3నే బాగుంటుందన్న వర్మ.. త్వరలో అయోద్యలో రామమందిరం నిర్మించటానికి మోడీ చేసే సర్కారీగిరిని మాత్రం తాను ఇష్టపడతానని వెల్లడించారు. తన దృష్టిలో శ్రీరాముడి కంటే మోడీనే పెద్ద దేవుడిగా అభివర్ణించిన ఆయన.. అందుకు తగ్గట్లు తన వ్యాఖ్యలపై జస్టిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
తాను రామరాజ్యాన్ని చూడలేదని.. మోడీ ఏలికలో అయోధ్య రాజ్యంలో ఉండటానికే తాను ఇష్టపడతానని చెప్పుకున్నారు. మోడీని పొగిడేసే క్రమంలో శ్రీరాముడ్ని వాడేసుకున్న వర్మ.. అయోధ్యలో రామాలయాన్నిమోడీ కట్టేస్తారన్నట్లుగా వర్మ చేసిన వ్యాఖ్యలపై హిందుత్వవాదుల దగ్గర నుంచి సెక్యులర్ వాదుల వరకూ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/