సినీ ప్రముఖుడు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ పట్టాన దేనిని వదిలే లేడు. వరల్డ్ లో జరిగే ప్రతి అంశంపై స్పందించే వర్మ తాజాగా మరో కీలక పరిణామంపై స్పందించారు ఇన్నాళ్ళు టీడీపీలో కీలక వ్యక్తిగా ఉన్న రేవంత్ రెడ్డి రీసెంట్ గా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం వర్మ తనదైన క్రియేటివిటినీ ఉపయోగించారు. రేవంత్ ని బాహుబలితో పోలుస్తూ మార్ఫింగ్ ఫోటోలని కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇందుకోసం తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150ని వాడుకున్నాడు. ఈ సినిమాలో చిరు స్టిల్స్‌కి సంబంధించి కొన్నింటిని మార్ఫింగ్ చేసి తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్ అంటూ వర్మ పోస్ట్ చేసేశాడు. ఈ ఫోటోలపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. వర్మ.. రేవంత్‌పై తనకున్న అభిమానం వేరేలా ప్రదర్శించుకోవాలే తప్ప, మా అభిమాన హీరో పోస్టర్స్ వాడుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ ఆర్జీవి పోస్ట్ చేసిన ఫోటోలపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.