వ‌ర్మ సంచ‌ల‌నం!.జ‌నం నోటా తార‌క్ మంత్ర‌మేన‌ట‌!

Update: 2019-06-01 16:42 GMT
మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ‌ట‌మంటే ఇదేనేమో. అస‌లు ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో అస‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకే జంకుతున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడును... సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ ప‌దే ప‌దే దెప్తి పొడుస్తున్నారు. మీ చేతిలో ప‌గ్గాలుంటే... ఇక టీడీపీ గ‌తి ఇంతేన‌ని, త‌క్ష‌ణ‌మే పార్టీ ప‌గ్గాల‌ను వ‌దిలేయాల‌ని, ఆ వెంట‌నే పార్టీకి కొత్త చీఫ్ గా జూనియ‌ర్ ఎన్టీఆర్ టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని వ‌ర్మ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ త‌న‌ది ఒక్క‌డిది మాత్ర‌మే కాద‌ని చెబుత‌న్న వ‌ర్మ‌... ఈ విష‌యంపై ఆన్ లైన్ పోల్ నిర్వ‌హించాన‌ని, అందులో పాలుపంచుకున్న నెటిజ‌న్ల‌లో ముప్పావు మంది తార‌క్ నే కోరుకుంటున్నార‌ని కూడా వ‌ర్మ చెబుతున్నారు.

అలా చంద్ర‌బాబు ప్లేస్ లో తార‌క్ ఉండాల‌ని కోరుకుంటున్న వారిలో టీడీపీ నేత‌లు కూడా ఉన్నార‌ని చెబుతూ వ‌ర్మ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే త‌క్ష‌ణ‌మే టీడీపీ ప‌గ్గాల‌ను తార‌క్ చేతిలో పెట్టాల‌ని, అప్పుడే పార్టీ బతికి బ‌ట్ట క‌డుతుంద‌ని చెబుతూ ఓ సంచ‌ల‌న ట్వీట్ ను విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత ఓ రోజు గ్యాప్ ఇచ్చిన వ‌ర్మ‌... తాజాగా టీడీపీ పగ్గాల‌ను తార‌క్ కు అప్ప‌గించ‌డంపై మీరేమంటారు? అంటూ ఆన్ లైన్ లో ఓ పోల్ ను పెట్టారు. ఈ పోల్ కు కూడా భారీగానే స్పంద‌న వ‌చ్చింద‌ట‌. ఆ పోల్ రిజ‌ల్ట్స్ ను ఆధారం చేసుకుని చంద్ర‌బాబును మ‌రోమారు కెలికేసిన వ‌ర్మ‌... తార‌క్ నాయక‌త్వాన్ని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నార‌ని, చివ‌ర‌కు టీడీపీ నేత‌లు కూడా అదే మాట అంటున్నార‌ని వ‌ర్మ మ‌రో ట్వీట్ రిలీజ్ చేశారు.

ఈ ట్వీట్ లో ఏముందంటే...*ఓహో. 79 శాత‌మా? ఇదిగో 79 శాతం మంది జనం తారక్ చేతిలోనే టీడీపీ పగ్గాలుండాలని కోరుకుంటున్నారు. ఈ రిజ‌ల్ట్ ని బట్టి చూస్తే తారక్‌ని కోరుకునే వాళ్లలో టీడీపీ పార్టీకి చెందిన వారు కూడా ఉన్నట్లేనా? లేక బాబును కోరుకునే వారు కేవలం 21 శాతం ముందేనా? జ‌స్ట్ ఆస్కింగ్‌.  తార‌క్ పార్టీ ప‌గ్గాలు చేప‌డితే టీడీపీ ప‌రిస్థితి మెరుగ్గా ఉంటుంద‌ని భావిస్తున్నా.* అంటూ వ‌ర్మ త‌న‌దైన శైలిలో సంధించిన ట్వీట్ లో చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేశార‌నే చెప్పాలి. మొత్తంగా ప‌రిస్థితిని చూస్తుంటే... టీడీపీ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు దిగిపోయే దాకా వ‌ర్మ ఆయ‌న‌ను వ‌దిలేలా క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.


Tags:    

Similar News