ఇద్దరు ప్రముఖుల మధ్య మాటల యుద్ధం మామూలే. సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత.. మీడియా మైకుల్ని వదిలేసి.. పోస్టులు.. ఫోటోలతో ఒకరిపై ఒకరు పంచ్ లు విసురుకోవటం అలవాటుగా మారింది. ఎవరు.. ఎవర్ని కదలించకున్నా సరే.. కెలికి మరీ కదిలించుకునే అవకాశాన్ని సోషల్ మీడియా ఇచ్చేసింది.
పాల్ మీద సెటైర్ వేసిన ఆయన.. ఈ మధ్యన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. మోడీ.. చంద్రబాబు లాంటి చిన్న చిన్న లీడర్ల మీద పోటీ చేసే కంటే జీసస్ ని ఓ ప్రపంచాన్ని సృష్టించమని కోరి.. దానికి అధ్యక్షుడైపోవాలంటూ పాల్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేవారు. దీనికి రియాక్ట్ అయిన పాల్.. తనను వర్మ ముంబై హోటల్లో కలిసిన వైనాన్ని చెబుతూ.. ఆ సందర్భంగా తన కాళ్లు పట్టుకున్నారన్నారు. అసలు తమ మధ్య మీటింగ్ లాంటివి ఏమీ ఉండవని డౌట్ వచ్చే అవకాశం ఉందన్న భావనో మరేమో కానీ.. సాక్ష్యంగా ఒక ఫోటోను విడుదల చేశారు.
అంతేకాదు.. వర్మకు సంబంధించి పాల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వావ్.. ఆర్జీవీ ముంబై హోటల్లో నన్ను కలిసి నా పాదాలకు వినయపూర్వకంగా నమస్కారం చేశారు. తన గురువు దాసరికి కూడా అలా ఎప్పుడూ చేయలేదన్నారు. ఇది చూసిన జ్యోతి.. వెంకట్ లు షాకయ్యారు. ఏపీ ప్రజలు నన్ను నాలుగు నెలల్లో సీఎంను చేయగానే.. మేం ఈ ప్రపంచంలోనే బెస్ట్ అని నిరూపించుకుంటాం. అప్పుడు దేశం గురించి ఆలోచిస్తానని పాల్ ట్వీట్ చేశారు.
అవతలోళ్లకు తాను పంచ్ లు వేయటమే కాదు.. తిరిగి తనకు కౌంటర్ రావటాన్ని ఏ మాత్రం ఇష్టపడని వర్మ.. పాల్ ఫోటో పంచ్ కు రియాక్ట్ అయ్యారు. ఈసారి మరింత దూకుడు పెంచేసి పాల్ ను ఎటకారం ఆడేసే ప్రయత్నం చేశారు పాల్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన వర్మ.. ప్రభువా! నేను పాల్ కాళ్లు ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకొని వెనక్కి లాగితే వెనక్కి పడి తన తల నేల కేసి కొట్టుకుని తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా. కానీ.. మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేశా అంటూ కామెంట్ చేశారు. ఇలా ఒకరికొకరు పోటాపోటీగా పెట్టుకుంటున్న పోస్టులు ఎక్కడి వరకూ వెళతాయో?